రాజన్ కొనసాగింపు.. భారత్కు మేలు..: దువ్వూరి | RBI Governor Raghuram Rajan's continuance would have benefited India: Subbarao | Sakshi
Sakshi News home page

రాజన్ కొనసాగింపు.. భారత్కు మేలు..: దువ్వూరి

Published Tue, Jul 26 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

రాజన్ కొనసాగింపు.. భారత్కు మేలు..: దువ్వూరి

రాజన్ కొనసాగింపు.. భారత్కు మేలు..: దువ్వూరి

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ కొన సాగితే బాగుంటుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ డి.సుబ్బారావు తెలిపారు. రాజన్ కొనసాగింపు వల్ల దేశంలోని స్థూల ఆర్థిక వ్యవస్థ, దాని నిర్వహణ మరింత మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. ‘మరోదఫా ఆర్‌బీఐ గవర్నర్‌గా కొనసాగననే రాజన్ నిర్ణయం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన తన బాధ్యతలను ఎంతో బాగా నిర్వహించారు. రాజన్ గవర్నర్‌గా కొనసాగితే దేశ స్థూల ఆర్థిక నిర్వహణ ఎంతో ప్రయోజనాన్ని పొందుతుంది’ అని వివరించారు.

ఆర్‌బీఐ తర్వాతి గవర్నర్‌గా ఎవరైతే బాగుంటుందనే ప్రశ్నకు బదులిస్తూ.. ఆర్థిక అంశాలపై పట్టులేకున్నా సరైన తెలివితేటలు, విజ్ఞానం, నాయకత్వ లక్షణాలు ఉంటే ఆర్‌బీఐని ముందుండి నడిపించవచ్చని చెప్పారు. దీనికి ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిన్ లగార్డ్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు. ఆమె ఆర్థికవేత్త కాదని, అయినా కూడా ఐఎంఎఫ్‌ను సమర్థంగా నడిపిస్తున్నారని కితాబిచ్చారు. బాధ్యతల నిర్వహణ అనేది వ్యక్తిపై ఆధారపడి ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement