32వేల మార్కు కిందకి సెన్సెక్స్
Published Wed, Aug 9 2017 9:45 AM | Last Updated on Mon, Sep 11 2017 11:41 PM
ముంబై : గ్లోబల్ మార్కెట్ల నుంచి వస్తున్న బలహీనమైన సంకేతాలతో స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీగా పతనమయ్యాయి. 150 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 137 పాయింట్ల నష్టంలో 32వేల కిందకి 31,876 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 9,950 మార్కు కింద 39.65 పాయింట్ల లాస్‌లో 9,938 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ బ్యాంకు 0.5 శాతం డౌన్ అయింది. యస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంకులు ఒత్తిడిలో కొనసాగుతుండటంతో, నిఫ్టీ బ్యాంకు ఇండెన్స్ నష్టాలు పాలవుతోంది. అంతేకాక సన్‌ఫార్మా, జేఎంఆర్ ఇన్‌ఫ్రాలు 4 శాతం మేర క్రాష్ అయ్యాయి.
నాల్కో, హిందాల్కో ఇండస్ట్రీస్, వేదాంత కంపెనీల షేర్లు 3 శాతం వరకు లాభాలు పండిస్తున్నాయి. మార్నింగ్ ట్రేడ్‌లో అమెరికా స్టాక్ ప్యూచర్స్ పడిపోవడంతో పాటు, ఆసియా మార్కెట్లు నష్టాలు పాలవుతున్నాయి. దీనికి తోడు షెల్ కంపెనీలపై సెబీ కొరడా ఝళిపించడం, లాభాల స్వీకరణ తోడై, దేశీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు బలపడి 63.78గా నమోదవుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 88 రూపాయల నష్టంలో 28,369 రూపాయల వద్ద ఉన్నాయి.
Advertisement