
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు చైర్మన్‌గా శ్రీకాంత్ మాధవ్ వైద్య నియమితులైనట్లు సమాచారం. ప్రస్తుతం ఇదే కంపెనీలో డైరెక్టర్ (రిఫైనరీస్)గా ఉన్న ఆయన్ను ప్రభుత్వ రంగ సంస్థల సెలక్షన్ బోర్డు (పీఈఎస్‌బీ) చైర్మన్ పదవికి ఎంపిక చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత చైర్మన్ సంజీవ్ సింగ్ పదవీకాలం వచ్చే ఏడాది జూన్‌తో ముగియనుంది. దీంతో తదుపరి చైర్మన్ కోసం పీఈఎస్‌బీ ఇంటర్వూ్యలు నిర్వహించింది.
అశోక్ లేలాండ్ సీఈఓగా విపిన్ సోంధి
న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అశోక్ లేలాండ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్‌గా విపిన్ సోంధి నియమితులయ్యారు. ఈ పదవి నుంచి వినోద్ కే దాసరి వైదొలగిన విషయం తెలిసిందే కాగా, ఆయన స్థానంలో విపిన్ తాజాగా పదవీ బాధ్యతలు చేపట్టినట్లు కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్ 12 (గురువారం) నుంచి 2024 డిసెంబర్ 11 వరకు నూతన సీఈఓ, ఎండీ పదవీకాలం కొనసాగుతుందని ప్రకటించింది. ఇంతకుముందు జేసీబీ ఇండియా, టాటా స్టీల్, శ్రీరామ్ హోండా సంస్థలకు విపిన్ సేవలందించారు.
Comments
Please login to add a commentAdd a comment