దారుణం : గాడిదల్ని దొంగలించారని... | 3 Dalits Thrashed Over Donkey Theft In Rajasthan | Sakshi
Sakshi News home page

దారుణం : గాడిదల్ని దొంగలించారని...

Published Sun, Feb 23 2020 6:16 PM | Last Updated on Sun, Feb 23 2020 7:18 PM

3 Dalits Thrashed Over Donkey Theft In Rajasthan - Sakshi

దాడి దృశ్యాలు

జైపూర్‌ : నాగౌర్‌లో దళిత అన్నదమ్ములపై దాడి ఘటన మరువక ముందే రాజస్తాన్‌లో మరో ఘటన కలకలం రేపింది. గాడిదలను దొంగతనం చేశారనే అనుమానంతో  ముగ్గురు దళితులను చితకబాదారు. ఈ సంఘటన రాజస్తాన్‌లోని జైసల్మీర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసు తెలిపిన వివరాల మేరకు.. జైసల్మీర్‌లో ఈ నెల 15న గాడిదలను దొంగతనం చేశారనే అనుమానంతో ఓ ముగ్గరు దళితులను కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా చితకబాదారు. కర్రలతో, కాళ్లతో కొడుతూ దారుణంగా ప్రవర్తించారు.

ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ఈ శనివారం వైరల్‌ కావటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు ఎటువంటి ఫిర్యాదు చేయకపోయినప్పటికి, వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చేపట్టారు.
చదవండి : స్క్రూ డ్రైవర్‌తో చిత్ర హింసలు పెడుతూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement