
చెన్నై: సంచలనాలకు కేంద్రబిందువు నటి భువనేశ్వరి. ఆమె కొడుకు కళాశాల విద్యార్థినిని పెళ్లి పేరుతో టార్చర్ పెట్టిన కేసులో అరెస్ట్ అయ్యి కటకటాలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకెళ్లితే స్థానిక వలసరవాక్కం, తిరుమలై నగర్, ఏంజల్ వీధిలో నటి భువనేశ్వరి నివశిస్తోంది. ఆమె కొడుకు (23) మిథున్ శ్రీనివాసన్ లా చదువుతున్నాడు. ఇతనికి స్థానిక అన్నానగర్, తిరుమంగళంలో నివశిస్తున్న ఒక యువతికి ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. అనంతరం ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం పెరగడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతిపై ఒత్తిడి చేయడం మొదలెట్టాడు. అందుకు ఆ యువతి నిరాకరించడంతో మిథున్ శ్రీనివాసన్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి గొడవ చేశాడు.
అంతే కాకుండా ఆ యువతి చదివే కళాశాలకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని టార్చర్ వేధించడంతో ఈ విషయాన్ని ఆ అమ్మాలు తల్లిదండ్రులకు చెప్పింది. వారు తిరుమంగళం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి మిథున్ శ్రీనివాసన్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇంతకు ముందు నటి భువనేశ్వరి ఇంట్లో పని కోసం శ్రీలంక నుంచి తీసుకొచ్చిన యువతితో తన కొడుకుకు పెళ్లి చేసినట్లు, ఆ అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించినట్లు మద్రాసు హైకోర్టులో కేసు విచారణలో ఉందన్నది గమనార్హం.