
సాక్షి,న్యూఢిల్లీ: రాజధానిలో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. ఢిల్లీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బృందం బుధవారం ఢిల్లీలో రూ 10 కోట్ల విలువైన రెండు కిలోల కొకైన్ కలిగిఉన్న అమెరికన్ మహిళను అరెస్ట్ చేసింది. ఎథియోపియా విమానం ద్వారా బ్రెజిల్ నుంచి డ్రగ్స్‌ను భారత్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు.
డ్రగ్స్‌తో పట్టుబడ్డ మహిళను ఢిల్లీలోని పింక్‌సిటీ హోటల్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. బ్రెజిల్‌లో ఓ నైజీరియన్ ఆమెకు పెద్దమొత్తంలో కొకైన్‌కు అందించగా దాన్ని ఆమె భారత్‌కు తీసుకువచ్చినట్టు తెలిసింది.
2017 ఫిబ్రవరి నుంచి ఆమె స్పెయిన్,స్విట్జర్లాండ్, ఉగాండాలు వెళ్లినట్టు ఆమె పాస్‌పోర్ట్ ద్వారా వెల్లడైంది. టూరిస్ట్ సీజన్ కావడంతో డ్రగ్స్ గోవాకు తరలిస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment