
కేసు వివరాలు తెలియజేస్తున్న పోలీస్ అధికారి
సాక్షి, హైదరాబాద్ : నగర శివారులో కాల్పుల కలకలం రేగింది. భూతగాద విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగటంతో ఓ వర్గం వారు రివాల్వర్‌తో బెదిరిస్తూ గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సోమాజిగూడాకు చెందిన మహమ్మద్ అల్తాఫ్ బహుదుర్‌గూడాలోని దండమెండి బయోటెక్‌కు చెందిన 110ఎకరాల స్థలం వద్ద సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు.
గత మంగళవారం సయ్యద్ రఫీ ఇషాక్.. సమీర్ హసీమ్, నుస్రత్ పటేల్, అసీఫ్ మోఈజ్, జంగయ్య రాజు అనే వ్యక్తులతో కలిసి 110 ఎకరాల భూమిలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా రివాల్వర్‌తో బెదిరిస్తూ గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో సూపర్ వైజర్ అల్తాఫ్ శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా సయ్యద్ రఫీ ఇషాక్‌పై గతంలోనూ పలుకేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment