
బస్సుకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
కోల్‌కతా : కోల్‌కతా మహానగరంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్రాసింగ్ వద్ద బస్సు సిగ్నల్ జంప్ చేసిన ఇద్దరు విద్యార్థులపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆ మార్గంలో వెళ్తున్న మూడు ఆర్టీసీ బస్సులకు నిప్పుపెట్టారు.
హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసులపై ఎదురుదాడికి దిగిన స్థానికులు రాళ్లదాడికి దిగారు. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లు రాగా స్థానికులు వాటిపై కూడా రాళ్లు విసిరారు.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఆందోళనకారులపై టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment