
పోలీసుల అదుపులో ఉన్న నిందితులు
నెల్లూరు(క్రైమ్): మైనర్‌బాలికపై ఈవ్‌టీజీంగ్‌కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితులను పోలీసులకు అప్పగించిన ఘటన ఆదివారం రాత్రి నెల్లూరులోని మినీబైపాస్‌లో అన్నమయ్య సర్కిల్ వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. డైకస్‌రోడ్డుకు చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో పాటు బంధువుల కుమార్తెను ఆదివారం గొలగమూడిలోని ఫన్‌పార్క్‌కు తీసుకెళ్లారు. తిరిగి స్కూటీపై ఇంటికి బయలుదేరుతూ బంధువుల కుమార్తెను గొలగమూడి నుంచి ఆటోలో ఎక్కించి దంపతులిద్దరూ వాహనాన్ని వెంబడిçస్తూ బయలుదేరారు.
అయితే కనుపర్తిపాడు సమీపంలోని మద్యం దుకాణం వద్ద సుందరయ్యకాలనీకి చెందిన పోతయ్య, గొలగమూడికి చెందిన నాగూరు అనే ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి మోటార్‌బైక్‌పై నగరంలోకి వస్తూ ఆటోలో వస్తున్న బాలికకు అసభ్యకర సైగలు చేస్తూ వెంబడించారు. ఈ విషయాన్ని వెనుక వస్తున్న దంపతులు గుర్తించి అన్నమయ్య సర్కిల్ వద్ద వారిని పట్టుకుని ప్రశ్నించగా ఎదురుతిరిగారు. దీంతో స్థానికులు అక్కడకు విషయం తెలుసుకున్నారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన పోతయ్య, నాగూరులకు దేహశుద్ధిచేసి నాలుగోనగర పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాలిక బంధువుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment