
టీ.నగర్(చెన్నై): వరుడు నచ్చలేదని చెప్పడంతో ఆగ్రహించిన తండ్రి కుమార్తె గొంతుకోసి హతమార్చాడు. ఈ దారుణ ఘటన గురువారం తమిళనాడులోని మదురై గోరిపాళయంలో చోటుచేసుకుంది. మారియమ్మన్‌కోవిల్ వీధికి చెందిన మహ్మద్ ఇస్మాయిల్ పుదుమండపంలో టైలరింగ్ షాపు నడుపుతున్నాడు. ఇతని భార్య మదీనాబేగం. కుమార్తె రిష్వానాభాను (22). ఈమెకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన తగాదాలో రిష్వానాభాను విడాకులు తీసుకుంది. ఇలావుండగా రిష్వానాభానుకు మరో పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నా వరుడు నచ్చలేదని చెబుతుండేది. దీంతో తండ్రి, కుమార్తెల మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం మరోసారి గొడవ జరిగింది. ఆగ్రహించిన ఇస్మాయిల్ కత్తి తీసుకుని ఆమె గొంతుకోసి హతమార్చాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment