పట్టుబడిన తొమ్మిది మంది నిందితులు, మీడియాతో మాట్లాడుతున్న సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ‘మీరు అధిక కొవ్వుతో బాధపడుతున్నారా? అయితే మీ బరువును తగ్గిస్తాం.. బక్క పలుచగా ఉంటే మీ బరువును పెంచుతాం.. శరీరంలో రోగనిరోధక స్థాయిని పెంచుతాం...కీళ్ల నొప్పులను హెర్బల్ మందులతో తగ్గుముఖం పట్టిస్తాం‘అంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో 40వేల మందిని పంపిణీదారులుగా చేర్చుకొని దాదాపు రూ.30 కోట్లు మోసం చేసిన 9మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ ఆర్థికనేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని మలక్‌పేట గంజ్‌లో ‘ప్రో హెల్తీవే ఇంటర్నేషనల్ ఎల్‌ఎల్‌పీ’ కంపెనీ పేరుతో కార్యక లాపాలు చేస్తున్న ముగ్గురు డైరెక్టర్లతోపాటు మరో ఆరుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి 3 ఖరీదైన కార్లతోపాటు బ్యాంక్ ఖాతాల్లోని 40 లక్షలను ఫ్రీజ్ చేశారు. కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఈవోడబ్ల్యూ ఇన్‌చార్జ్ విజయ్‌కుమార్‌తో కలసి పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం మీడియాకు తెలిపారు.
ముఠా కట్టిన వారంతా తెలుగువారే...
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువును మధ్యలోనే ఆ పేసిన చార్మినార్ దబీర్‌పురాకు చెందిన మహమ్మద్ రిజ్వాన్ యూనస్, కుత్బుల్లాపూర్‌లో నివాసముంటున్న కర్నూలు వాసులు భట్టు సాయికొండ హర్షవర్ధన్ రాజు, అలూరు నరేశ్, విశాఖకు చెందిన పప్పల సాయిచరణ్, వరం గల్ వాసులు వంకుడోతు వేణు నాయక్‌లు మల్టీలెవల్ మార్కెటింగ్ వైపు అడుగులు వేశా రు. వివిధ మార్కెటింగ్ కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో సులభంగా డబ్బు సంపాదించాలని ఆరోగ్యకర ఉత్పత్తుల పేరిట మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీ ప్రారంభించారు. ఇలా రిజ్వాన్ యూనస్ తండ్రి మహమ్మద్ ఇషాక్ సహకారంతో మలక్‌పేటలో ‘ప్రో హెల్తీవే ఇంటర్నేషనల్ ఎల్‌ఎల్‌పీ కంపెనీ’ రెండేళ్ల క్రితం ఏర్పాటైంది. ఈ ఆరుగురికి తోడు, విశాఖపట్నానికి చెందిన ఎర్రగంటి సత్య మణికంఠ, వరంగల్ వాసిభుక్యా అనిల్‌కుమార్, కర్నూలుకు చెంది న కొండా శ్రీనివాసులు కలిశారు. ఈ కంపెనీకి సీఈవోగా రిజ్వాన్ యూనస్, డైరెక్టర్లుగా హర్ష వర్ధన్‌రాజు, మహమ్మద్ ఇషాక్‌లు ఉండగా, మిగతావారు డిస్ట్రిబ్యూటర్లుగా పనిచేశారు.
కమీషన్ల వల.. టైటిళ్లతో ఆకర్షణ: ఈ గొలుసు కట్టు పథకంలో 4వేలు చెల్లించి సభ్యు డిగా చేరినవారికి వారి కంపెనీ పేరిట ఆరోగ్యకర ఉత్పత్తులు ఇచ్చేవారు. ఒకరు మరో ఇద్దరిని చేర్పిస్తే 25శాతం కమీషన్, వారు మరో ఇద్దరిని చేర్పిస్తే 25శాతం కమీషన్ ఇచ్చేవారు. ఇలా దశలవారీగా వెళ్లేది. 6 వేల నుంచి రూ.10 కోట్ల వరకు వ్యాపారం చేసిన వారికి క్లబ్, రూబీ , స్టార్ రూబీ మెంబర్...ఇలా క్రౌన్ బ్లాక్ డైమండ్ టైటిల్ ఇచ్చి ప్రోత్సహించారు. పథకంలో భాగంగా గోవా విహారయాత్రనూ ఆఫర్ చేశారు. అలావారు ఉత్పత్తులు కొనేలా చేశారు. నెలకు రూ.90వేలు వంతున ఏడాది పాటు అమ్మకాలు జరిపిస్తే ఎఫ్‌టీబీ కింద రూ. కోటీ 18లక్షల95వేలు గెలుచుకోవచ్చంటూ ఆశ చూపించారు. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, వైజాగ్, కర్నూలు జిల్లాల్లో సమావేశాలు పెట్టి నిరుద్యోగులు, వృద్ధులను మోస గించారు. నెలకు 1,500 మందిని చేర్పిస్తూ ముందుకెళుతున్న ఈ ముఠా కార్యకలాపాలపై శామీర్‌పేట పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు అంద డంతో ఈవోడబ్ల్యూ అధికారులు నిఘా వేసి మలక్‌పేటలోని కంపెనీ కార్యాలయంలో నిందితులను పట్టుకున్నారు. ఒక్కరు మినహా మిగిలిన వారంతా 23 నుంచి 27 ఏళ్లలోపు వారు కావడం గమనార్హం.
రూ.300 వస్తువులు.. రూ.4వేలు
రాజస్తాన్ బిల్వారాలోని హెచ్‌ఏఎస్ హెర్బల్ కంపెనీ, హైదరాబాద్‌లోని మహబూబ్ హెర్బల్స్, పంజాబ్ లూథియానా లోని కేవా ఇండస్ట్రీస్‌లో తక్కువ ధరకు వేద్ గెయిన్, వేద్ ఫిట్, గిలాయ్ జ్యూస్, ఆర్థో ఆయిల్, హార్ట్ కేర్, 42 హెర్బ్స్ ఆయిల్, హెర్బల్ టూత్ పేస్ట్, వేద్ లైఫ్ హెర్బల్ పౌడర్, జస్ట్ వేద్ మాయిశ్చరైజర్, టాన్ జెల్, అక్నీ లోషన్, షాంపూ, యాంటీ రాడియంట్ చిప్స్ పేరుతో ఉత్పత్తులు కొనుగోలు చేసేవారు. రూ.300 నుంచి రూ.500 లకు కొనుగోలు చేసిన ఈ ఉత్పత్తులను రూ.4వేలకు ఇచ్చేవారు. గడియారాలు, బె ల్ట్‌లు బహుమతిగా ఇచ్చి 40వేల మంది స భ్యులను ఆకర్షించారు. రూ.30కోట్ల వ్యా పారం చేశారు. ఈ ఆరోగ్య ఉత్పత్తులు అను మతి లేనివని, నాసిరకమైనవిగా పోలీసులు గుర్తించారు.లైసెన్స్‌లు తీసుకోకుండా వ్యా పారం చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవల్సిందిగా లేఖ రాస్తామని సీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment