విద్యార్థిని స్నేహలత (ఫైల్)
అనంతపురం, ఓడీ చెరువు: మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఇంటి నుంచి తప్పిపోయిందంటూ బాలిక తండ్రి శివానంద గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ లింగన్న తెలిపిన వివరాలమేరకు.. ఓడీ చెరువు మండలం నవాబుకోటకు చెందిన శివానంద కుమార్తె స్నేహలత కళాశాలకు వెళ్తున్నానని అదే గ్రామానికి చెందిన బాబ్‌జాన్ అటోలో ఈ నెల 24న వెళ్లింది. సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కళాశాలలో విచారించారు. కళాశాలకు హాజరు కాలేదని తెలుసుకొని చుట్టుపక్కల సమీప బంధువుల గ్రామాల్లో గాలించారు. విద్యార్థిని ఆచూకీ తెలియకపోవడంతో విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మిస్సింగ్ చేసు నమోదు చేసుకొని బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థిని ఆచూకీ తెలిసిన వారు 9490114572 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment