కిడ్నాప్‌ కథ సుఖాంతం.. | Kidnap Case Reveals Vijayawada Police | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కథ సుఖాంతం..

Published Sat, Sep 21 2019 12:55 PM | Last Updated on Sat, Sep 21 2019 12:55 PM

Kidnap Case Reveals Vijayawada Police - Sakshi

అకీస్‌ను కిడ్నాప్‌ చేసిన మాయా, చాను

ఉంగుటూరు (గన్నవరం) : డబ్బు ఎంతటి దారుణానికైనా పాల్పడేలా చేస్తుంది. దీనికి నిదర్శనమే ఇటీవల జరిగిన అకీస్‌ (8నెలలు) అపహరణ. ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద సోను, పూలుబాయి దంపతులు తమ బంధువులతో కలసి మట్టి పాత్రలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. కాగా సోను తన సోదరి వద్ద రూ.36 వేలు అప్పు తీసుకొని చెల్లించకపోవడంతో అతని సోదరి మాయ ఆమె భర్త చానులు కలసి ఈ నెల 17న పూలుబాయి వద్ద నుంచి అకీస్‌ను తీసుకొని జైపూర్‌ వెళ్లారు. దీంతో పూలుబాయి ఆత్కూరు పోలీసులను ఆశ్రయించింది. ఆమె పిర్యాదుతో పోలీసులు బృందంగా ఏర్పడి వారితో పాటు అకీస్‌ తండ్రిని తీసుకొని జైపూర్‌ వెళ్లారు. అక్కడి పోలీసుల సహకారంతో, సాంకేతిక పరిజ్ఞానంతో చాకచక్యంగా జైపూర్‌లో నిందితులను 40 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న తల్లి తన కొడుకు కోసం విజయవాడలో సంతోషంతో ఎదురు చూస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement