సాక్షి, హైదరాబాద్ : సెల్ఫీల మోజులో నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నా... సెల్ఫీల పిచ్చి మాత్రం వదలడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోనూ సెల్పీ ప్రేమికుల పాలిట శాపంగా మారింది. సెల్ఫీ తీసుకుంటుండగా.. లోయలో పడి ప్రేమికులు తీవ్రగాయాలయ్యాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మెహదీపట్నంకు చెందిన నాగరాజు, నిజామాబాద్‌కు చెందిన ప్రియాంక నార్సింగ్‌లోని ఓ ప్రముఖ స్టోర్‌లో పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. మంగళవారం ఉదయం... వీళ్లద్దరు బండ్లగూడలోని కాళీమందిర్ గుడికి వెళ్లారు. గుడి సమీపంలోని ఎత్తైన కొండలు చేరుకుని సెల్ఫీ తీసుకోవాలనుకున్నారు. సెల్ఫీ తీసుకుంటుండగా... పట్టుతప్పి లోయలో పడిపోయి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ప్రేమికులిద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment