సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సోమవారం రాత్రి ప్రేమజంట పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. హన్మకొండ హంటర్ రోడ్డుకు చెందిన మేరుగు హరిప్రియ, పెండ్యాల సాయికుమార్ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వీరు ఆత్మహత్యాయత్నం చేయగా.. హరిప్రియ మృతి చెందింది. సాయికుమార్‌ను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలా ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment