ముజఫర్ మృతదేహం
బాన్సువాడ: నిజాంసాగర్ ప్రధాన కాలువలో ఈత కోసం వెళ్లి, స్నేహితుడిని రక్షించేందుకు ప్రయత్నించి కాలువలో కొట్టుకుపోయిన ముజఫర్ అనే యువకుడు మంగళవారం శవమై తేలాడు. ఈనెల 25న ఆదివారం పట్టణంలోని అరాఫత్ కాలనీలో నివసించే ముజఫర్ తన మిత్రులతో కలిసి ప్రధాన కాలువకు ఈతకు వెళ్లారు. అక్కడ ముగ్గురు మిత్రులు స్నానం చేసేందుకు కాలువలో దిగగా, ముజఫర్ ఒడ్డున కూర్చున్నాడు. ఓ మిత్రుడికి ఈత రాకపోవడంతో అతను కొట్టుకుపోతుండగా, అతడిని రక్షించేందుకు ముజఫర్ నీళ్లలో దిగాడు. అయితే మిత్రుడు సురక్షితంగా బయటపడినా, ముజఫర్ నీళ్లలో కొట్టుకుపోయాడు. రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టగా, మంగళవారం అతని శవం పోచారం సమీపంలో లభించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment