
రేషన్ డీలర్ పోస్టుల ఎంపిక పరీక్షల్లో దగ్గరగా కూర్చుని చూసి రాసుకుంటున్న అభ్యర్థులు ,అభ్యర్థికి సమాధానాలు చెబుతున్న బంధువు
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న వారు ఏదో సమీక్షా సమావేశంలో ఉన్నారనుకుంటే పొరబడినట్లే. టెక్కలి డివిజన్‌లో ఖాళీగా ఉన్న 25 చౌకధరల దుకాణాల డీలర్ల ఎంపిక కోసం మంగళవారం టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో ఎంపిక పరీక్ష నిర్వహించారు. దీనికోసం 98 మంది దరఖాస్తులు చేసుకోగా 82 మంది హాజరయ్యారు. ఎంతో పక్కాగా జరగాల్సిన ఈ పరీక్షల్లో ఇలా చూసి రాతలు చోటుచేసుకున్నాయి. కొందరు బంధువులు ఏకంగా పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల వద్దకు వెళ్లి సమాధానాలు చెప్పడం గమనార్హం. ఈ పరీక్షల్లో వయసు దాటిన వారితో పాటు కొంత మంది అధికార పార్టీకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా హాజరు కావడం విశేషం. – టెక్కలి
Comments
Please login to add a commentAdd a comment