నిందితుడు డాక్టర్ భాస్కరాచారి (ఫైల్)
తార్నాక : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పి సక్రమ మార్గంలో నడిచేలా తీర్చిదిద్దాల్సిన ఓ శాస్త్రవేత్త కట్టు తప్పాడు. తన వద్ద చదువుతున్న ఓ విద్యార్థిపై కన్నేసి వక్రబుద్దిని బయటపెట్టాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉద్యోగం పోగొట్టుకుని కటకటాలు లెక్కిస్తున్నాడు. విద్యార్థినిని మానసికంగా, శారీకరంగా వేధింపులకు గురిచేసి గత నాలుగు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న సైంటిస్టును ఓయూ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం కాచిగూడ డివిజన్ ఏసీపీ నర్సయ్య, ఓయూ ఇన్‌స్పెక్టర్ జగన్ వివరాలు వెల్లడించారు.
కోల్‌కతకు చెందిన దళిత విద్యార్థిని తార్నాకలోని జాతీయపోషకహార సంస్థ(ఎన్‌ఐఎన్)లో ఎమ్మెస్సీ అప్లయిడ్ న్యూట్రీషన్ కోర్సు చదువుతోంది. కోర్సు చివరి సెమిస్టర్‌లో భాగంగా ఆమె డిజర్టేషన్ (పరిశోధనా అంశానికి సంబంధించిన థీసిస్)ను పూర్తి చేయాల్సి ఉందిం. ఆమెకు పర్యవేక్షకునిగా ఎన్‌ఐఎన్‌లో డిప్యూటి డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఈ–గ్రేడ్‌సైంటిస్టు డాక్టర్ భాస్కరాచా వ్యవహరిస్తున్నాడు. గత జనవరి నుంచి డిసర్టేషన్ పనిలో భాగంగా అతని ల్యాబ్‌కు వస్తున్న ఆమెపై కన్నేసిన భాస్కరచారి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీనిని ఆమె పెద్దగా పట్టించుకోకపోవడంతో మరింత రెచ్చిపోయి ఆమెకు వాట్సప్‌లలో బూతు బొమ్మలు, మెసేజ్‌లు పంపడం మొదలు పెట్టాడు. అతని ఆగడాలు శృతిమించడంతో ఇది మంచిపద్దతి కాదని సదరు విద్యార్థిని భాస్కరాచారిని వేడుకున్నా అతను పట్టించుకోకపోగా ఆమెపై శారీరక వేధింపులకు పాల్పడుతున్నాడు.
దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా సదరు సైంటిస్టును విధుల నుంచి తప్పించారు. ఈ విషయం తెలియడంతో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు ఎన్‌ఐఎన్‌ను సందర్శించి ఉద్యోగులు, అధికారులు, కమిటీ సభ్యులు, బాధితురాలితో మాట్లాడి సైంటిస్టుపై కమిషన్ చైర్మన్‌కు నివేదిక అందజేశారు. అంతేగాక ఎస్సీ కమిషన్‌సభ్యులు, బాధిత విద్యార్థిని కలిసి ఓయూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏసీపీ స్థాయి అధికారిచే విచారణ జరిపిన అనంతరం డాక్టర్ భాస్కర చారిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా, గత రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్నాడు. భాస్కరాచారి తమ బంధువుల ఇంట్లో దాక్కున్నట్లు సమాచారం అందడంతో ఓయూ పోలీసులు శుక్రవారం అతడిని అరెస్టు చేశారు. అతనిపై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ యాక్టు2015,సెక్షన్ 354, 354(ఏ),509,3(1)(డబ్లు్య),3(2), 5(ఏ),67 ఐటీ యాక్టు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment