
మృతదేహాల కోసం గాలిస్తున్న రెస్క్యూ టీమ్
భాగ్యనగర్‌కాలనీ: కుటుంబ తగాదాల కారణంగా చెరువులో దూకి ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తులసీవనం ప్రాంతంలోని ఎల్లమ్మ చెరువు సమీపంలో నివాసం ఉంటున్న మెదక్ జిల్లా, పాపన్న పేటకు చెందిన ఉప్పు రాజు(26), రేణుక దంపతులు కూలి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వరుసకు అల్లుడైన పల్లపు ప్రసాద్(14) వారి వద్దే ఉంటూ అదే ప్రాంతంలోని చికెన్‌షాపులో పనిచేస్తున్నాడు.
అల్లుడు తమ వద్ద ఉండటం ఇష్టం లేకపోవడంతో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం కూడా వారి మధ్య ఘర్షణ జరగడంతో జీవితంపై విరక్తి చెందిన వారు ఆత్మహత్య చేసుకునేందుకు ఎల్లమ్మ చెరువు వద్దకు వచ్చారు. మొదట అల్లుడు ప్రసాద్ నీటిలో దూకగా, రేణుక చెరువులో దూకే క్రమంలో రాజు ఆమెను వెనక్కు లాగి తాను చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెçస్క్యూ టీమ్ సహాయంతో రాజు మృతదేహాన్ని వెలికితీశారు. ప్రసాద్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment