
సుమన్ మృతదేహం
నర్సింహులపేట : మద్యానికి బానిసై.. కన్న తల్లిని ధూషించడం.. అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొడుకును తండ్రి ఉరివేసి చంపిన సంఘటన శుక్రవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం శివారు గోపాతండాలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్సై సంతోష్‌రావు కథనం ప్రకారం.. గోపాతండాకు చెందిన అజ్మీరా లక్ష్మణ్, బుజ్జి దంపతుల కుమారుడు అజ్మీరా సుమన్(23) మద్యానికి బానిసై నిత్యం తల్లిదండ్రులను వేధించేవాడు.
దీంతో సుమన్ భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే సుమన్ గురువారం అర్ధరాత్రి కన్నతల్లిపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో విసుగు చెందిన తండ్రి లక్ష్మణ్.. తన కొడుకుకు తాడుతో ఉరివేసి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న సీఐ చేరాలు, ఎస్సై సంతోష్‌రావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం సుమన్ మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.