
గుంటూరు: కామంతో కళ్లు మూసుకుపోయిన యువకుడు ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నిందితుడు టీడీపీ నేత తనయుడు. బాధితులు వారి సామాజిక వర్గానికి చెందినవారే కావడం, పేదరికంతో ఉండటంతో విషయం బయటికి పొక్కకుండా డబ్బు ఇచ్చి రాజీ చేసినట్టు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులకు కూడా డబ్బు ముట్టచెప్పినట్టు సమాచారం. అమృతలూరు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధిత కుటుం బసభ్యులు సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని తెలిసింది. పోలీసులకు కూడా ఎలాంటి ఫిర్యాదూ అందలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment