
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కృష్ణా : గన్నవరంలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ఒకరు మృతి చెందగా.. అతడ్ని కాపాడే క్రమంలో మరో వ్యక్తి మృతి చెందిన ఘటన ఇరువురి కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. వివరాలు.. సింగరాయకొండకు చెందిన షేక్ మస్తాన్ భాషా(20), కావలికి చెందిన షేక్ కరీం భాషా(19)లు వేసవి సెలవులు కావడంతో గన్నవరంలోని బాబాయి ఇంటికి వచ్చారు. ప్రమాదవశాత్తు కరీం భాషా చెరువులో పడిపోగా.. అతన్ని కాపాడేందుకు మస్తాన్ భాషా ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తు ఇద్దరూ మృతి చెందారు. దీంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.