
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం వేకువ ఝామున రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు.
కాన్పూర్ సమీపంలోని సజేటి దగ్గర ఓ బ్రిడ్జిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేయిస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.