మావోయిస్టులు తగులబెట్టిన లారీ
సాక్షి, రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందగా, మరో 15 మంది మావోయిస్టులకు గాయాలైనట్లు ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. సుకుమా జిల్లాలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిపారు. మావోయిస్టుల జాడ కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కాగా, ఆదివారం మావోయిస్టుల మందు పాతర పేలి ఏడుగురు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.
రెచ్చిపోతున్న మావోయిస్టులు
విశాఖపట్నం : ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల బంద్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. బంద్ సందర్భంగా మాయిస్టులు రెచ్చిపోతున్నారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో బీడీ ఆకుల లారీని మావోయిస్టులు తగులబెట్టారు. జగదాల్ పూర్ జాతీయ రహదారి 63పై జరిగిన ఘటనలో లారీ పూర్తిగా దగ్దం కాగా, ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. పాడేరు, చింతపల్లిలో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. మరోవైపు ఒడిషా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment