![Woman Abducted And Molested By Six Men In Rajasthan - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/26/gang-rape.jpg.webp?itok=mLF6PM5M)
జైపూర్ : రాజస్తాన్‌లో దారుణం జరిగింది. ఓ వివాహిత మహిళను అపహరించి నెల రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు దుండగులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగౌర్ జిల్లాకు చెందిన ఓ మహిళను ఆరుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆమెను వివిధ ప్రదేశాలకు తరలిస్తూ నెల రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నెల రోజుల తర్వాత వదిలేసి ఈ విషయం బయట చెప్తే చంపుతామని బెదిరించారు. ఇంటికి వచ్చిన మహిళ కుటుంభ సభ్యులతో కలిసి నాగౌర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురి దుండగుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment