
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. కలెక్టర్ కార్యాలయానికి ముందే ఓ యువతిని ప్రేమోన్మాది గొంతుకోసి హత్య చేశాడు. రక్తపు మడుగులో పడిఉన్న యువతిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. నిందితుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మృతురాలి వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆమె రామగుండంలోని హనుమాన్ నగర్ చెందిన రసజ్ఞగా గుర్తించారు. ఆమె కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మీ సేవా కేంద్రంలో పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం మీ సేవా కేంద్రం వద్దకు వచ్చిన యువకుడు మాట్లాడాలని ఆమెను బయటకు పిలిచాడు. అనంతరం యువతిపై దాడి చేసి ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంకు చెందిన వంశీధర్ అని పోలీసులు తెలిపారు. ఇరువురి ప్రేమ వ్యవహారమే హత్య కారణంగా అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment