
సాక్షి, యాచారం: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతిచెందింది. యాచారం మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన బాలమణి (23) కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైంది. తీవ్ర ఆవేదనతో ఇటీవల ఇంట్లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రి సూచన మేరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. బాలమణికి నాలుగు నెలల కిందే తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన నాగరాజుతో పెళ్లి జరిగింది. వేధింపులతోనే బాలమణి మృతి చెందిందని బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటయ్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment