నిందితురాలు శరణ్య, స్వాధీనం చేసుకున్న నగలు
అన్నానగర్: తిరుప్పూర్‌లో బాడుగకు ఇల్లు అడిగినట్లు నటించి నగలు, నగదు చోరీలకు పాల్పడుతున్న యువతిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి 50 సవర్ల నగలు స్వాధీనం చేసుకున్నారు. తిరుప్పూర్ కుమరానందపురం ప్రాంతంలో ఇళ్లు, దుకాణాల్లో వరుసగా నగలు, నగదు చోరీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు బాధితులు తిరుప్పూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా విచారణ చేయగా వీటన్నింటికీ ఓ మహిళ కారణమని గుర్తించారు.
తిరుప్పూర్ కొత్త బస్టాండ్‌లో యువతిని అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. విచారనలో నిందితురాలు శివగంగై జిల్లా వెట్రియూర్ ఉసిలంగులానికి చెందిన శరణ్య (27)అని, ప్రస్తుతం ఈరోడ్ జిల్లాలో ఉంటున్నట్లు తెలిసింది. తిరుప్పూర్‌కు వచ్చి కుమరానందపురంలో ఇల్లు బాడుగకు తీసుకొని, ఎవరూ లేని ఇళ్లే లక్ష్యంగా 40 సవర్ల నగలు చోరి చేసినట్లు తెలిసింది. ఇది కాకుండా అనుప్పర్‌పాలైయమ్ ప్రాంతంలో ఉన్న 10 సవర్ల నగలు చోరి చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment