
దేవేందర్(ఫైల్)
ముత్తారం(మంథని): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం సీతంపేట గ్రామానికి చిలుక దేవేందర్ (25) క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. దేవేవందర్ తండ్రి తన చిన్నతనంలో చనిపోయాడు. ఆటో నడుపుకుండూ తల్లి కొమురమ్మ, చెల్లిని పోషిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం రామగిరి మండలం బేగంపేటకు చెందిన బంధువులకు రూ.1.30 లక్షలు బాకీగా ఇచ్చాడు. గతేడాది చెల్లి పెళ్లి చేశాడు. దానికి కొంత అప్పు అయ్యింది.
ఆ అప్పు తీర్చేందుకు తాను అప్పు ఇచ్చిన వ్యక్తి వద్దకు వెళ్లి డబ్బులు ఇమ్మని అడిగాడు. దానికి అతను నిరాకరించడంతో మనస్తాపం చెందిన దేవేందర్ పురుగుల మందుతాగాడు. కుటుంబసభ్యులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి చనిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment