
మహేశ్వరి(ఫైల్) ఇరానీబీ(ఫైల్)
నల్లకుంట: ఓ యువతి అదృశ్యమైన సంఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహేశ్వరి(19) అనే విద్యార్థిని నల్లకుంటలోని ఆమె చిన్నమ్మ సంగీత ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది. గత నెల 28న బయటికి వెళ్లిన మహేశ్వరి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో చుట్టుపక్కల వారిని, పరిచయస్తులను విచారించినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో సంగీత ఆదివారం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సేవాశ్రమంలో..
సికింద్రాబాద్: జీరాలోని మానసిక వైకల్యం, వృద్ధుల సేవాశ్రమం నుంచి ఓ యువతి అదృశ్యమైన సంఘటన గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మీనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 2న జీరా వృద్ధుల సేవాశ్రమం నుంచి ఇరానీబీ(20) అనే యువతి కనిపించకుండా పోవడంతో సేవాశ్రమం నిర్వాహకులు ఆదివారం గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు గాంధీనగర్ పోలీసు స్టేషన్, లేదా 040–27853585 నంబర్‌కు సమాచా రం అందించాలని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment