జీవన సాఫల్యం
రుజుమార్గం
ప్రాపంచిక జీవితం తాత్కాలికం. పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టవలసిందే. అందుకని తాత్కాలికమైన ఈ ప్రాపం చిక జీవితంలో శాశ్వత జీవితానికి పనికొచ్చే కర్మ లను ఆచరించాలి. నీతి, నిజాయితీతో ఆచరించిన సత్కర్మలే పరలోకంలో పనికొస్తాయి. ఇహలోక జీవన సుఖసంతోషాల కోసం అడ్డదారులు తొక్కితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది.
మానవుడి శ్వాస ఆగిన మరుక్షణమే అతని కర్మల క్రమం తెగిపోతుంది. ఫలితం కనిపించకుండా పోతుంది. కాని మూడు రకాల కర్మలకు సంబంధిం చిన ఫలితాలు మాత్రం సదా అతని ఖాతాలో జమ అవుతూనే ఉంటాయి. వాటి పుణ్యఫలం నిరంతరం అందుతూనే ఉంటుంది. అవే ప్రజలకు ప్రయోజనం చేకూర్చే సత్కార్యాలు. అంటే, మంచినీటి బావి తవ్విం చడం, పాఠశాల నిర్మాణం, మసీదు నిర్మాణం, సత్రం కట్టించడం, వాగులు, వంకల మీద వంతెన నిర్మిం చడం, మరే విధంగానైనా ప్రజలకు దీర్ఘకాలిక, శాశ్వ త ప్రయోజనం కలిగే పనులు చేయాలి. మరొకటి, ధార్మిక విద్యా విజ్ఞానాలు. ప్రజలను నైతికంగా, ఆధ్యా త్మికంగా తీర్చిదిద్దే విద్యాబోధన. ముఖ్యంగా ఖురాన్ ప్రవచనాలు; ప్రవక్త వారి హితవచ నాలు, ఉత్తమ సాహిత్య సృజన, వా టి ప్రచురణ, పంపిణీ. ఇవి కూడా సత్కార్యాలే. ప్రజలు ఈ బోధనల ద్వారా, సాహిత్యం ద్వారా ప్రయోజ నం పొందుతున్నంత కాలం తరతరాల పుణ్య ఫల మంతా వారి కర్మల చిట్టాలో చేరుతూనే ఉంటుంది.
ఉత్తమ సంతానం. తల్లిదండ్రులు జీవించి ఉన్నం తకాలం వారికి ఏ విధమైన లోటు రాకుండా ప్రేమతో సేవలు చేస్తూ, వారి పర్యవేక్షణలో, శిక్షణలో ఉత్తము డిగా, దైవభక్తి పరాయణునిగా ఉంటారో, అలాంటి వారి కర్మల పుణ్యం కూడా నిరంతరం వారి తల్లిదం డ్రులకు లభిస్తూనే ఉంటుంది. అంటే, తమ పర్యవే క్షణలో సంతానం ఉత్తములుగా తయారై సత్కార్యాలు ఆచరిస్తే ఆ పుణ్యఫలం వారితోపాటు వీరికీ లభిస్తూనే ఉంటుంది.
అందుకని, ప్రజల తాత్కాలిక అవసరాలు తీర్చ డంతో పాటు, దీర్ఘకాలిక, శాశ్వత సంక్షేమ కార్యకలా పాలలో అధికంగా పాల్గొనాలి. పవిత్ర గ్రంథ బోధ నలు, ప్రవక్త ప్రవచనాలను ప్రజలకు పరిచయం చేసి, నైతికంగా, ఆధ్యాత్మికంగా ఎదిగేలా ప్రోత్సహించాలి. మానవీయ విలువలు ప్రజా బాహుళ్యంలో ప్రోది చేయ డానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలి. తల్లిదం డ్రులను కంటికి రెప్పలా చూసుకుంటూ, వారిసేవలో తరించాలి. వారికోసం తరచుగా ప్రార్థిస్తూ ఉండాలి.
మరణం ఒక పచ్చి నిజం. దీనికి ఎవరూ అతీ తులు కాదు. అది ఎప్పుడొస్తుందో, ఎలా వస్తుందో ఎవ రికీ తెలియదు. కాబట్టి, తాత్కాలికమైన ఈ చిన్న జీవి తంలో నీతినిజాయితీలతో బతకాలి. ధర్మబద్ధమైన జీవనవిధానం అవలంబించాలి. అప్పుడే మానవ జీవి తం సార్థకమవుతుంది.
యండి.ఉస్మాన్ ఖాన్