అనంతపురం అగ్రికల్చర్ : ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాకు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు కేటాయించాలని కోరగా కమిషనరేట్ నుంచి అనుమతులు లభించినట్లు వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ‘సాక్షి’కి తెలిపారు. అందులో అత్యధికంగా కాంప్లెక్స్ ఎరువులు 86,662 మెట్రిక్ టన్నులు, యూరియా 52,574 మెట్రిక్ టన్నులు, 3,456 మెట్రిక్ టన్నులు డీఏపీ, 6,364 మెట్రిక్ టన్నులు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంవోపీ), 1,626 మెట్రిక్ టన్నులు సింగిల్ సూపర్ పాస్ఫేట్ (ఎస్‌ఎస్‌పీ) కేటాయించినట్లు తెలిపారు. ఈ ఎరువులు వివిధ కంపెనీల నుంచి నెలవారీ కోటా ప్రకారం జిల్లాకు సరఫరా అవుతాయన్నారు.
అందులో ఏప్రిల్ కోటాలో 12,064 మెట్రిక్ టన్నులు, మేలో 22,616 మెట్రిక్ టన్నులు, జూన్‌లో 27,139 మెట్రిక్ టన్నులు, ఆగస్టులో 36,695 మెట్రిక్ టన్నులు, సెప్టెంబర్‌లో 18,088 మెట్రిక్ టన్నులు మేర జిల్లాకు సరఫరా కానున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 40 వేల మెట్రిక్ టన్నుల వరకు నిల్వలు ఉన్నందున ఖరీఫ్ రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. అంతేకాకుండా జూన్ నుంచి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ విధానంతో ఎరువుల అమ్మకాలు (డీటీబీ) సాగించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఖరీఫ్‌కు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు
Published Sun, May 14 2017 11:30 PM | Last Updated on Mon, Oct 1 2018 6:45 PM
Advertisement
Advertisement