సాక్షి, హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 18వ స్నాతకోత్సవంలో వీసీ అప్పారావు నుంచి పీహెచ్‌డీ పట్టాను తీసుకోనని సభాముఖంగా తిరస్కరించిన వేల్పుల సుంకన్న వీడియోకి నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికి దాదాపు లక్షా 70 వేలకు పైగానే వీక్షకులు తిలకించారు. సెంట్రల్ వర్సిటీలోనూ, దేశవ్యాప్తంగానూ దళిత విద్యార్థులు ఎదుర్కొంటోన్న వివక్ష, అవమానాలకు తిరస్కారంగా హెచ్‌సీయూ దళిత పరిశోధక విద్యార్థి వేల్పుల సుంకన్న పీహెచ్‌డీ డిగ్రీని నిరాకరించిన విషయం తెలిసిందే. ఇదే వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తోంది.