వెంకటేష్‌గౌడ్ హత్య కేసులో మరొకరు అరెస్టు
Published Fri, Feb 10 2017 11:05 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
కర్నూలు: మద్దూరు నగర్‌లో జనవరి 24వ తేదీన హత్యకు గురైన డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్‌గౌడ్ హత్య కేసులో సూత్రధారిగా భావిస్తున్న కల్లూరుకు చెందిన మాజీ డీలర్ కాంతారావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో జనవరి 31వ తేదీన ఎరుకలి శ్రీనివాసులు, ఎరుకలి రాము, చిన్న మౌలాలీ అలియాస్ గిడ్డు, దేవాయత్తు శివుడు నాయక్‌ను అరెస్టు చేయగా, ఈనెల7వ తేదీన సూత్రధారిగా భావిస్తున్న జలంధర్‌గౌడ్, షేక్ ఉస్మాన్‌గనిబాషా, అలియాస్ టోపీబాషా, గువ్వల గిడ్డయ్య, పుల్లకూర పక్కీరయ్యను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 9 మందిపై కేసు నమోదు కాగా, చివరి నిందితుడిగా భావిస్తున్న కాంతారావును శుక్రవారం కల్లూరులోని ఆయన ఇంటికి ఎదురుగా ఉన్న నీలకంఠేశ్వర దేవాలయంలో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుచగా, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు మూడో పట్టణ సీఐ మధుసూదన్‌రావు తెలిపారు.
Advertisement
Advertisement