
ఆరోగ్యశ్రీ నిర్లక్ష్యంపై నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా
పేద వర్గాలకు వరప్రదాయినిగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, దీనికి నిరసనగా వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తెలిపారు. ఈ ధర్నాకు ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
అనంతపురం అర్బన్ : పేద వర్గాలకు వరప్రదాయినిగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, దీనికి నిరసనగా వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తెలిపారు. ఈ ధర్నాకు ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆరోగ్యశ్రీ పథకాన్ని ‘ఎన్టీఆర్ వైద్యసేవ’గా మార్పు చేశారే తప్ప.. అవసరమైన నిధులు మాత్రం మంజూరు చేయలేదని విమర్శించారు. దీంతో పేదలు తీవ్ర ఇబ్బందిపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గతంలో ఎందరో పేదలు ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా పొందారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. గుండె, కిడ్నీ తదితర ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసేందుకు అనుమతి మంజూరు చేయాలంటూ చాలా ఆస్పత్రులు పెట్టుకున్న వినతులపై ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. ఇప్పటికే చికిత్స చేసిన వాటికి రూ. లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉందని వెల్లడించారు. ఈ పథకానికి నిధుల లేమిని ప్రభుత్వం సాకుగా చూపడం దుర్మార్గమన్నారు.