శాస్త్రవేత్త లక్ష్మీప్రియకు అవార్డు
బనగానపల్లె : చిరుధాన్యాలపై విలువాధారిత ఉత్పత్తుల తయారీ కేంద్రాలను ప్రోత్సహించినందుకు యాగంటిపల్లె కృషివిజ్ఞాన కేంద్రం గృహవిజ్ఞాన శాస్త్రవేత్త లక్ష్మిప్రియకు గురువారం అవార్డు అందజేశారు. జాతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ అడిషనల్ సెక్రటరీ అశోక్ దల్వాయి చేతుల మీదుగా అవార్డును లక్ష్మిప్రియకు అందజేశారు. ఈ సందర్భంగా కృషివిజ్ఞాన కేంద్రం ప్రధాన అధికారి, సీనియర్ శాస్త్రవేత్త ధనలక్ష్మితోపాటు ఇక్కడి శాస్త్రవేత్తలు సుధాకర్, బాలరాజు, రమణయ్య, రాజేశ్వరరెడ్డిలు లక్ష్మిప్రియను అభినందించారు.