టిఫిన్ బాంబు పేలి వ్యక్తికి గాయాలు
Published Thu, Dec 1 2016 10:13 AM | Last Updated on Wed, Apr 3 2019 3:55 PM
జయశంకర్: జిల్లాలోని వెంకటాపురం మండలం విజయపురి కాలనీ వద్ద మావోయిస్టులు పెట్టిన బాంబు పేలి ఓ వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. పీఎల్‌జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ మావోయిస్టులు బ్యానర్లు కట్టారు. ఆ బ్యానర్లకు ఓ టిపిన్ బాంబును కనపడకుండా అమర్చారు. ఆ బ్యానర్లను పోలీసులు ఆటో డ్రైవర్లతో తొలగించడానికి యత్నించడంతో బాంబు ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో కార్తీక్ అనే ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.
దీంతో షాక్ కు గురైన పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement