ఆటోను ఢీకొన్న బస్సు
ఆటోను ఢీకొన్న బస్సు
Published Tue, Jul 11 2017 12:43 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
నరసాపురం రూరల్ : నరసాపురం–మొగల్తూరు 216 జా తీయ రహదారిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందగా మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, నరసాపురం రూర ల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. నరసాపురం నుంచి మొగల్తూరు వైపు ఏడుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను రుస్తుంబాద సెవెన్‌తడే స్కూల్ సమీపంలో నరసాపురం వైపు వస్తున్న ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న జెట్టిపాలెంకు చెం దిన కడలి రత్నమాణిక్యమ్మ (60) అక్కడికక్కడే మృతిచెందిం ది. మిగిలిన వారికి తీవ్రగాయాలయ్యా యి. మృతురాలికి భర్త, ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరంతా వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. మాణిక్యమ్మ రెండు రోజుల క్రితం దిగమర్రు పుట్టింటికి వెళ్లగా తిరిగి వస్తుండగా మృత్యువాత పడింది.
క్షతగాత్రులు ప్రభుత్వాస్పత్రికి..
ఆటోలోని ఆరుగురు ప్రయాణికులు, డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా వీరిని నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పేరుపాలెం, తూర్పుతాళ్లు గ్రామాలకు చెందిన దొంగ సావిత్రి, దొంగ సీతామహాలక్ష్మి, దొంగ భవాని, కవురు వెంకట కృష్ణారావు, సంపంగి సునీత, ఆటో డ్రైవ ర్ పంపన శ్రీనుప్రసాద్‌కు తీవ్ర గాయాలు కాగా విద్యార్థి పవన్‌కు స్వల్పగాయాలయ్యాయి. నరసాపురం రూరల్ ఎస్సై కర్రి సతీష్‌కుమార్ కేసు నమోదు చేసి సీఐ ఎం.సుబ్బారావు ఆధ్వర్యంలో ద ర్యాప్తు చేస్తున్నారు. మాణిక్యమ్మ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంది. కళాశాల బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రోడ్డు విస్తరణ పనులే కారణమా..
కొంతకాలంగా నరసాపురం–మొగల్తూ రు 216 జాతీయ రహదారి విస్తరణ పనులు చేస్తున్నారు. దీంతో తరచుగా ఈ రోడ్డులో ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు చెబుతున్నారు. రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా రహదారిని కొంత భాగం తవ్వి వదిలేయడంతో ప్రమాదా లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
Advertisement