సీఎం వస్తున్నారని అధికారుల హడావుడి
సీఎం వస్తున్నారని అధికారుల హడావుడి
Published Sun, Aug 6 2017 11:58 PM | Last Updated on Sun, Sep 17 2017 5:14 PM
సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు సీఎం చంద్రబాబునాయుడు పరిశీలనకు సోమవారం వస్తున్నారని అధికారులు ఉరుకులు,పరుగులు తీస్తున్నారు. ఉదయం నుండి అధికారులు పలు ఏర్పాట్లుపై దృష్టిసారించారు. సీఎమ్ కాన్వాయ్‌కు ఎటువంటి అవంతాలు కలుగకుండా రోడ్డు మార్గంలో కాన్వాయ్ ట్రైల్ రన్ వేశారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హెలీప్యాడ్ స్వాదీనం: సీతానగరం డిగ్రీకళాశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను అధికారుల స్వాదీనం చేసుకున్నారు. కళాశాల ఆవరణలో ఐరన్ బారికేట్లు ఏర్పాటు చేశారు. అధికారులు తప్ప ఎవరిని లోపలికి రానీయకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఉదయం నుండి అర్బన్ ఎస్పీ రాజకుమారి, నార్త్‌జోన్ డీఎస్పీ శ్రీనివాస్‌లు హెలీప్యాడ్ వద్ద పరిశీలించారు. ఏలూరు డీఐజీ రామకృష్ణ, ఎస్పీ రాజకుమారి, సబ్ కలెక్టర్ విజయరామరాజు, ఎమ్మెల్యే పెందుర్తి వెంకేటేష్‌లు కళాశాల నుంచి కాన్యాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు
ఆ మార్గంలో పలు ఏర్పాట్లు ..
సీతానగరం నుంచి పురుషోత్తపట్నం 10 కిలోమీటర్లు పొడవునా రోడ్డును మరమ్మతులు చేశారు. అలాగే ఏటిగట్టుపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. రోడ్డు కిరువైపులా తెల్ల రంగుతో బోర్డర్‌ను ఏర్పాటు చేశారు. సింగవరం, వంగలపూడి, రామచంద్రపురం గ్రామాల వద్ద ఏటిగట్టుపై ఉన్న బస్ స్టాఫ్ షెడ్‌లకు తెల్లరంగులు అద్దారు. అలాగే రోడ్డు మార్గంలో మైలురాళ్ల కు పసుపు రంగులు వేసి, కిలోమీటర్లు గుర్తించే అంకెలు వేశారు
బారికేడ్ల ఏర్పాటు
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వద్ద ఏటిగట్టుపై ఐరన్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. సీఎం పరిశీలించే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ పలు ఏరాట్లు చేశారు. పురుషోత్తపట్నంలో యాంటీ నక్సల్స్ స్క్వాడ్ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్రామాల వద్ద ఏటిగట్టుపై యాంటీ నక్సల్స్ స్క్వాడ్ పహారా కాస్తున్నారు. అలాగే పోలీస్ సిబ్బంది పికెట్‌లు ఏర్పాటు చేశారు. మండలంలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలులతో కలసి మండలానికి 800 మంది సిబ్బంది తరలివచ్చారు.
Advertisement
Advertisement