సీఎం పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు
సీఎం పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు
Published Tue, Jun 6 2017 10:58 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM
ట్రాఫిక్ డీఎస్పీ సత్యనారాయణ వెల్లడి
కాకినాడ క్రైం : సీఎం చంద్రబాబునాయుడు కాకినాడ పర్యటన పురస్కరించుకుని జూన్ 8న ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీ కేవీవీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం స్థానిక టూటౌన్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవనిర్మాణ దీక్ష ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబునాయుడు కాకినాడ వస్తుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు.
- విశాఖపట్టణం నుంచి కాకినాడకు వచ్చే అన్ని లారీలు, భారీ వాహనాలు అచ్చంపేట జంక‌్షన్ నుంచి ఏడీబీ రోడ్డు మీదుగా వాకలపూడి నుంచి కుంభాభిషేకం రోడ్డు మీదుగా జగన్నాథపురం రూట్‌లో వెళ్లాలి.
- రామచంద్రపురం, అమలాపురం, యానాం వైపు నుంచి కాకినాడ మీదుగా వెళ్లే లారీలు, భారీ వాహనాలు ఎన్టీఆర్ కొత్త బ్రిడ్జి, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ నుంచి జగన్నాథపురం, కుంభాభిషేకం, వాకలపూడి, ఏడీబీ రోడ్డు మీదుగా అచ్చంపేట నుంచి వెళ్లాలి.
- విశాఖ నుంచి కాకినాడ ఆర్టీసీ బస్టాండ్‌కొచ్చే ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులన్నీ నాగమల్లిసెంటర్ నుంచి ఆర్టీవో కార్యాలయం, గొడారిగుంట సెంటర్, మదర్‌థెరిస్సా స్కూల్ నుంచి వైఎస్సార్ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లాలి. ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి విశాఖవైపు వైళ్లే ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులు పై రూట్‌లో వెళ్లాలి.
- కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి యానాం, రావులపాలెం, విజయవాడ వైపు వెళ్లే బస్సులు, ఆయా ప్రాంతాల నుంచి కాకినాడకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ జగన్నాథపురం కొత్త బ్రిడ్జి, వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, పోర్ట్ పోలీస్‌స్టేషన్, డెయిరీ ఫారం సెంటర్, సాంబమూర్తినగర్ అయిదో వీధి గుండా మదర్‌థెరిస్సా, వైఎస్సార్ విగ్రహం సెంటర్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్సుకి వచ్చి, ఇదే రూట్‌లో తిరిగి ఆయా గమ్యస్థానాలకు చేరుకోవాలి.
- సామర్లకోట, జగ్గంపేట, రాజమహేంద్రవరం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ బాలాజీచెరువు సెంటర్ వద్ద ప్రయాణికులను దింపివేయాలి. అక్కడి నుంచి మళ్లీ ఆయా గమ్యస్థానాలకు చేరుకోవాలి. ఒకవేళ ఆర్టీసీ కాంప్లెక్సుకి వెళ్లాల్సి వస్తే మాధవపట్నం నుంచి సర్పవరం జంక‌్షన్, నాగమల్లిజంక‌్షన్, ఆర్టీవో కార్యాలయం సెంటర్, గొడారిగుంట, లక్ష్మీ హాస్పిటల్, మదర్‌థెరిసా సెంటర్ నుంచి వైఎస్సార్ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్సుకు చేరుకోవాలి. ఇదే రూట్‌లో వెనక్కి సామర్లకోట, జగ్గంపేట, రాజమహేంద్రవరం చేరుకోవాలి.
-సీఎం సభకు వచ్చే వాహనాలకు పార్కింగ్
తుని వైపు నుంచి కాకినాడ వచ్చే వాహనాలన్నీ భానుగుడి వద్దకు చేరుకోవాలి. రిజర్వు పోలీస్ గ్రౌండ్‌లో వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సామర్లకోట, అమలాపురం, రామచంద్రపురం నుంచి కాకినాడకు వచ్చే వాహనాలన్నీ మెక్లారిన్ హైస్కూల్, పీఆర్ ప్రభుత్వ కళాశాల్లో పార్కింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
Advertisement
Advertisement