నేడు ముఖ్యమంత్రి జిల్లా పర్యటన
Published Thu, Dec 29 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM
మోరి గ్రామంలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్ అరుణ్ కుమార్
కాకినాడ సిటీ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాఫ్టర్‌లో సఖినేటిపల్లి మండలం మోరిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ముందుగా స్మార్ట్ విలేజ్‌పై కార్పొరేట్ ఎగ్జిక్యూటర్లతో సమావేశం కానున్నారు. అనంతరం గ్రామంలో ఎల్‌ఈడీ బల్పుల వినియోగాన్ని ప్రారంభించడంతోపాటు గ్రామాన్ని నూరుశాతం డిజిటల్ వినియోగం, బహిరంగ మలవిసర్జన లేని గ్రామంగా ప్రకటన చేయనున్నారు. మోరిలో ఇంటిపన్ను, నీటి పన్నులను ఆ¯ŒSలై¯ŒS ద్వారా చెల్లించే విధానానికి ప్రారంభిచనున్నారు. అంతర్వేదిపాలెంలో నిర్వహించనున్న ఫిషింగ్ జెట్టీకు, కేశనపల్లి చానల్ పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు రాజోలులో ఏర్పాటు చేసే బ్లడ్‌బ్యాంక్‌ను కూడా ప్రారంభిచనున్నారు. ముఖ్యమంత్రి మోరి గ్రామ పర్యటనకు సంబందించి వివిధ శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, వివిధ శాఖాల అధికారులు పాల్గొన్నారు.
Advertisement