తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మూడో రోజు సోమవారం కూడా మెదక్ జిల్లా గజ్వేల్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గడిపారు.
జగదేవ్‌పూర్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మూడో రోజు సోమవారం కూడా మెదక్ జిల్లా గజ్వేల్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో గడిపారు. శనివారం రాత్రి ఆయన ఇక్కడకు వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఆయన ఫాంహౌస్‌లో తిరుగుతూ పంటలను పరిశీలించారు.
అల్లం పంటకు సంబంధించి ఫాంహౌస్ బాధ్యులకు కేసీఆర్ సూచనలిచ్చినట్లు తెలిసింది. అలాగే సాయంత్రం కూడా తన సతీమణి శోభతో కలిసి పంటలను పరిశీలించారు. సీఎం మంగళవారం సాయంత్రం హైదరాబాద్ తిరిగి వెళ్తారని తెలిసింది. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.