కొనసాగుతున్న ఉద్యోగుల క్రికెట్ పోటీలు
కడప స్పోర్ట్స్: కడప నగరంలో నిర్వహిస్తున్న విద్యుత్ ఉద్యోగుల ఇంటర్ సర్కిల్ క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. నగరంలోని వైఎస్ రాజారెడ్డిృఏసీఏ క్రికెట్ మైదానం, వైఎస్ రాజారెడ్డిృఏసీఏ మైదానం, కేఎస్‌ఆర్‌ఎం, కేఓఆర్‌ఎం క్రీడా మైదానంలో మ్యాచ్‌లు నిర్వహించారు.
వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్ మైదానంలో..
నగరంలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్ మైదానంలో కడప జోన్, ఒంగోలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఒంగోలు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 17.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులోని ప్రసాద్ 64 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు.
కేఎస్‌ఆర్‌ఎం క్రీడా మైదానంలో..
నగరంలోని కేఎస్‌ఆర్‌ఎం క్రీడామైదానంలో నిర్వహించిన తొలిమ్యాచ్‌లో అనంతపురం, వైజాగ్ జట్లు తలపడ్డాయి. టాస్‌గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వైజాగ నిర్ణీత 20 ఓవర్లలో 111 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంత జట్టు 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 115 పరుగులు చేసింది. దీంతో అనంత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అనంతరం నిర్వహించిన రెండో మ్యాచ్‌లో గుంటూరు, తిరుపతి జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన తిరుపతి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుంటూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో తిరుపతి జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.
కేఓఆర్‌ఎం క్రీడామైదానంలో..
కేఓఆర్‌ఎం క్రీడామైదానంలో నిర్వహించిన తొలిమ్యాచ్‌లో విజయనగరం, కడప జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన విజయనగరం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. దీంతో కడప జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో రాజమండ్రి, శ్రీకాకుళం జట్లు తలపడగా టాస్ గెలిచిన రాజమండ్రి జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీకాకుళం జట్టు 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. దీంతో రాజమండ్రి జట్టు శ్రీకాకుళంపై 62 పరుగుల తేడాతో విజయం సాధించింది.