Current employees
-
కార్మిక సంఘాలు పోరుకు సై..!
సాక్షి, పాల్వంచ: తెలంగాణా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమస్యలపై కార్మిక సంఘాలు పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. జెన్కో, ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ తదితర సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 23 వేల మందిని ఆర్టిజన్లుగా తీసుకుని రెండేళ్లు గడుస్తున్నా పర్మనెంట్ చేయలేదు. దీంతోపాటు సరైన విధి విధానాలు సైతం ప్రకటించకపోవడంతో కార్మిక సంఘాలు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్(టీ టఫ్)గా ఏర్పడి ప్రభుత్వంపై ఉద్యమ కార్యాచరణకు రంగం సిద్ధం చేశాయి. జెన్కో వ్యాప్తంగా పాల్వంచ కేటీపీఎస్ కాంప్లెక్స్‌లో అక్టోబర్ 4న ధర్నా నిర్వహించి పోరాటానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో సుమారు 23 వేల మంది కార్మికులను 2017 జూలై 17న ఆర్టిజన్ కార్మికులుగా తీసుకున్నారు. ఒక్క కేటీపీఎస్ కాంప్లెక్స్‌లోనే సుమారు 2 వేల మంది కార్మికులు ఉండగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో 1,500 మంది కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించారు. వారిని పూర్తి స్థాయి ఉద్యోగులుగా పరిగణించాలని, అందుకు ఏపీఎస్ఈబీ రూల్స్‌ను పరిగణలోకి తీసుకోవాలని నాలుగు దఫాలుగా లేబర్ కమిషనర్ గంగాధర్ వద్ద సమావేశాలు నిర్వహించారు. కానీ తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉద్యమ బాటే శరణ్యమని కార్మికులు భావిస్తున్నారు. దశలవారీ కార్యాచరణ.. పోరాడితే తప్ప కార్మిక సమస్యలు పరిష్కారం కావని టీ టఫ్ నాయకులు అంటున్నారు. ఈ క్రమంలో జెన్కో, ట్రాన్స్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ తదితర సంస్థల కార్మిక సంఘాల నేతలు ఏకమయ్యారు. జెన్కో ఆధ్వర్యంలో పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) అంబేద్కర్ సెంటర్లో అక్టోబర్ 4న ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాకు రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాల ప్రధాన నేతలు, కార్మికలు తరలిరానున్నారు. 11న ఎస్పీడీసీఎల్ హన్మకొండ ప్రధాన కార్యాలయం ఎదుట, అక్టోబర్ 16న ఎన్పీడీసీఎల్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయం ముందు, అక్టోబర్ 23న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే విద్యుత్ ఉత్పత్తి స్తంభించేలా ఉద్యమాలు కొనసాగిస్తామని నేతలు తెలిపారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసే విషయంలో నాడు ఏపీఎస్ఈబీ అనుసరించిన విధానాన్నే ఇప్పుడు కూడా అమలు చేయాలనేది ఆర్టిజన్ల ప్రధాన డిమాండ్. అంతేకాక పెన్షన్ సౌకర్యం, కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 24 గంటల నిరంతర విద్యుత్ అలవెన్స్, మెడికల్ పాలసీ, నివాస సముదాయాల నిర్మాణం వంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. -
మా నాన్నకు జీతం పెంచండి
విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు ‘కరెంటోళ్ల దీక్షలు’ పేరుతో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమం సోమవారం కూడా కొనసాగింది. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల పిల్లలు, కుటుంబసభ్యులు కూడా ఈ దీక్షల్లో పాల్గొన్నారు. ‘మా నాన్నకు జీతం పెంచండి’ అని రాసిన ప్లకార్డులతో చిన్నారులు ఆందోళనలో పాల్గొనటం గమనార్హం. ఎస్వీఎన్ కాలనీ(గుంటూరు) : న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి 14వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు కలెక్టరేట్ రోడ్డులో రహదారిపై బైఠాయించి తమ నిరసనను తెలిపారు. ధర్నా శిబిరంలో భార్యా, పిల్లలతో కలిసి కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్వీ నరసింహారావు మాట్లాడుతూ 14 రోజులుగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్నా యాజమాన్యాలుగాని, ప్రభుత్వంగాని స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన విజయవాడలోని విద్యుత్ సౌధ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. స్పందన రాకుంటే 10న రహదారుల దిగ్బంధం, 12న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌కు కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. సీఐటీయూ నాయకులు పోపూరి సుబ్బారావు, హుస్సేన్‌వలి, కాంగ్రెస్ నేత వినయ్‌కుమార్, సీపీఎం జిల్లా నాయకులు పాశం రామారావు, ఓబీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, యూనియన్ నేతలు శివకుమారి, షకీలా పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ఉద్యోగుల క్రికెట్ పోటీలు
కడప స్పోర్ట్స్: కడప నగరంలో నిర్వహిస్తున్న విద్యుత్ ఉద్యోగుల ఇంటర్ సర్కిల్ క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. నగరంలోని వైఎస్ రాజారెడ్డిృఏసీఏ క్రికెట్ మైదానం, వైఎస్ రాజారెడ్డిృఏసీఏ మైదానం, కేఎస్ఆర్ఎం, కేఓఆర్ఎం క్రీడా మైదానంలో మ్యాచ్‌లు నిర్వహించారు. వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్ మైదానంలో.. నగరంలోని వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్ మైదానంలో కడప జోన్, ఒంగోలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఒంగోలు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 17.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులోని ప్రసాద్ 64 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. కేఎస్ఆర్ఎం క్రీడా మైదానంలో.. నగరంలోని కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో నిర్వహించిన తొలిమ్యాచ్‌లో అనంతపురం, వైజాగ్ జట్లు తలపడ్డాయి. టాస్‌గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వైజాగ నిర్ణీత 20 ఓవర్లలో 111 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంత జట్టు 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 115 పరుగులు చేసింది. దీంతో అనంత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అనంతరం నిర్వహించిన రెండో మ్యాచ్‌లో గుంటూరు, తిరుపతి జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన తిరుపతి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుంటూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో తిరుపతి జట్టు 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేఓఆర్ఎం క్రీడామైదానంలో.. కేఓఆర్ఎం క్రీడామైదానంలో నిర్వహించిన తొలిమ్యాచ్‌లో విజయనగరం, కడప జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన విజయనగరం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. దీంతో కడప జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో రాజమండ్రి, శ్రీకాకుళం జట్లు తలపడగా టాస్ గెలిచిన రాజమండ్రి జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీకాకుళం జట్టు 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. దీంతో రాజమండ్రి జట్టు శ్రీకాకుళంపై 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
ఉల్లాసంగా క్రికెట్ పోటీలు
కడప స్పోర్ట్స్: క్రీడలు ఆడడం ద్వారా మానిసిక ఉల్లాసం కలుగుతుందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వెంకటశివారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి- ఏసీఏ క్రికెట్ మైదానంలో విద్యుత్ ఉద్యోగుల ఇంటర్ సర్కిల్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని సూచించారు. పని ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులు పోటీల్లో పాల్గొనడం సంతోషకరమైన విషయమన్నారు. జిల్లాలో ఎంతో ఆకర్షణీయమైన చక్కటి టర్ఫ్ వికెట్లతో కూడిన క్రికెట్ మైదానాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, అంకిత భావంతో ఆడాలని సూచించారు. క్రీడలతో ఉద్యోగుల్లో పునరుత్తేజం ఏపీఎస్పీడీసీఎల్ డివిజినల్ ఇంజినీర్ (టెక్నికల్) శోభా వాలెంటీనా మాట్లాడుతూ విధి నిర్వహణలో విద్యుత్ ఉద్యోగులు చాలా ఒత్తిడి ఎదుర్కొంటుంటారని, ఇలాంటి పోటీల ద్వారా వారిలో పునరుత్తేజం కలుగుతుందని తెలిపారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రామ్మూర్తి మాట్లాడుతూ ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఈ పోటీల్లో వివిధ సర్కిల్స్‌కు చెందిన 24 జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ డీఈ (ఎంఅండ్‌టీ) బ్రహ్మానందరెడ్డి, విద్యుత్‌శాఖ ఏడీఈ చాన్‌బాషా, ఏఈ శ్రీధర్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి వై.శివప్రసాద్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఇక మహిళా సాధికార కార్పొరేషన్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం రేపటి మంత్రిమండలి భేటీలో ఆమోదముద్ర! విద్యుత్ ఉద్యోగుల ఫిట్మెంట్, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్న కేబినెట్ సాక్షి, హైదరాబాద్: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. తర్వాత రుణాల మాఫీ కాకుండా మహిళా సంఘాల్లోని సభ్యులకు రూ.10 వేల చొప్పున మూలధనం కింద ఇస్తామన్నారు. వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి రైతు సాధికార కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి.. తాజాగా మహిళా సాధికార కార్పొరేషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో సీఎం అధ్యక్షతన జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు సోమవారం అధికారులు ఫైలును రూపొందించారు. ఆర్థిక శాఖతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదం తీసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ఆమోదంతో మహిళా సాధికార కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని కేబినెట్ భేటీ ఎజెండాలో చేర్చారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్)ని ఈ కార్పొరేషన్లో విలీనం చేయనున్నారు. దీంతో సెర్ప్ ఉద్యోగులు, ఆస్తులు, అప్పులు అన్నీ.. ఈ కార్పొరేషన్ పరిధిలోకి రానున్నాయి. అయితే గతంలో చంద్రబాబు ప్రభుత్వమే ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను మరో సంస్థలోకి తీసుకోరాదంటూ చట్టం తీసుకురావడం గమనార్హం. ఆ చట్టానికి సవరణలు చేయకుండా సెర్ప్ ఉద్యోగులను కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్లోకి తీసుకోవడం సాధ్యం కాదని ఆర్థిక శాఖ చెబుతోంది. ఇలావుండగా విద్యుత్ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సిఫారసు చేస్తూ ఇంధన శాఖ సోమవారం ముఖ్యమంత్రికి ఫైలు పంపింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకుని, ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ నెల 18 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా కేబినెట్ చర్చించనుంది. ప్రధానంగా రైతుల రుణ మాఫీని నామమాత్రంగా చేయడంపై, మహిళా సంఘాలకు రుణ మాఫీ చేయకపోవడంపై ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తే ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై చర్చించనున్నట్టు సమాచారం. వ్యాట్ చట్టంలో సవరణలు చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. వాస్తవానికి మంగళవారం జరగాల్సిన కేబినెట్ భేటీ.. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ అంత్యక్రియలు ఇదేరోజున ఉండటంతో బుధవారానికి వాయిదా పడింది. -
సమ్మె హీట్
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: వేతన సవరణ కోసం విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన మెరుపు సమ్మె ప్రజా జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి జిల్లాలో అధిక శాతం గ్రామాలు అంథకారంలో చిక్కుకోగా పట్టణాల్లోనూ అనేక ప్రాంతాలకు క్రమంగా సరఫరా నిలిచిపోతోంది. రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి జిల్లాలోని సుమారు 1200 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 400 మంది కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. కాగా ఉదయం 9 గంటల నుంచే సమ్మె ప్రభావంతో విద్యుత్ కష్టాలు ప్రారంభమయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు మొదలయ్యాయి. విధుల్లో ఉన్న ఇంజినీర్లు మరమ్మతులు చేస్తున్నా అవి ఎంతో సేపు నిలవడం లేదు. మరో వంక ఎడతెరిపి లేని వర్షం మరమ్మతులకు ఆటంకంగా మారింది. సాయంత్రానికి జిల్లాలో 10 శాతం మినహా అన్ని ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది. తమ సమస్య పరిష్కరించేందుకు లిఖితపూర్వకమైన హామీ ఇస్తేగానీ సమ్మెను విరమించేది లేదని ఉద్యోగ సంఘ నాయకులు చెబుతున్నారు. చర్చలు ఫలించిసమ్మె విరమించినా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని, సోమవారమే పునరుద్ధరణ పనులు చేపడతామని జిల్లా విద్యుత్ అధికారులు చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేక సతమతం ఉద్యోగులు మెరుపుసమ్మె చేపట్టడంతో ట్రాన్స్ కో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారు. దీని వల్ల ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురియడం, మేఘాలు కమ్ముకోవడంతో ఇళ్లలో చీకట్లు అలుముకున్నాయి. ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న ఇన్వర్టర్లు మూడు నాలుగు గంటల్లోనే చేతులెత్తేశాయి. వర్షం వల్ల వాతావరణం చల్లబడడంతో ప్రజలు కొంతమేర ఊపిరి పీల్చుకోగలిగారు. అయితే పగటిపూట కరెంటు లేకపోయినా ఎలాగోలా గడిపేసినా రాత్రంతా చీకటిలో మగ్గిపోవలసిందేనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విద్యుత్ లేక దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా విద్యుత్ కష్టాలకు నీటికష్టాలు తోడయ్యాయి. జనరేటర్లపైనే ఆస్పత్రులు, హోటళ్లు విద్యుత్ సమస్యతో ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం వాటిల్లింది. పెద్ద పెద్ద ఆస్పత్రులు జనరేటర్ల సాయంతో పని చేసినా చిన్న ఆస్పత్రుల్లో సేవలు దాదాపు నిలిచిపోయాయి. ఇక సినిమా థియేటర్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు జనరేటర్లతో కొనసాగాయి. పరిశ్రమల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. పలు పెట్రోల్ బంకులు కొద్ది సేపటి వరకు జనరేటర్‌తో పనిచేసినా కొద్దిసేపటికే వాటిని మూసివేశారు. విజయనగరం వెళ్లిన సిబ్బంది వెనక్కి.. విజయనగరంలో గత రెండుమూడు రోజుల్లో ఈదురు గాలుల ధాటికి దెబ్బతిన్న విద్యుత్ లైన్ల మరమ్మతులకు జిల్లా నుంచి 230 మంది సిబ్బందిని పంపారు. అయితే ప్రస్తుత అత్యవసర పరిస్థితిలో ఆ సిబ్బందిలో 130 మందిని వెనక్కి రప్పించారు. వీరు ఆదివారం పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్నారు. ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాలతో జరుపుతున్న చర్చలు సఫలమవుతాయని భావిస్తున్న జిల్లా అధికారులు విజయనగరం పంపించిన సిబ్బందిలో సగం మందిని వెనక్కి పిలిచారు. పునరుద్ధరణకు అధికారుల కృషి సిబ్బంది మెరుపు సమ్మె వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరణకు ఇంజినీర్లు కృషి చేస్తున్నారని ట్రాన్స్‌కో ఎస్ఈ పీవీవీ సత్యనారాయణ చెప్పారు. వర్షం తమకు కొంతమేర ఇబ్బంది కలిగించిందని పేర్కొన్నారు. సోమవారం నాటికి ఉద్యోగులు సమ్మె విరమించి విధుల్లో చేరుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విజయనగరం పంపించిన సిబ్బందిలో సగం మందిని వెనక్కి రప్పిస్తున్నామని, అవసరమైన పక్షంలో జిల్లాలో మరమ్మతులు పూర్తయిన తరువాత మళ్లీ పంపిస్తామన్నారు. ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట ఆందోళన మెరుపు సమ్మెకు దిగిన ఉద్యోగులు ఆదివారం ఉదయం ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఉద్యోగ సంఘ నాయకుడు గోపాల్ విలేకరులతో మాట్లాడుతూ అధికారులు గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోక పోగా గడువును పొడిగిస్తూ వస్తున్నారని విమర్శించారు. విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని ప్రజలను కష్టపెట్టడం తమ అభిమతం కాదన్నారు. అధికారులతో జరుపుతున్న చర్చలు సఫలమైతే రాత్రింబవళ్లు శ్రమించి విద్యుత్‌ను పునరుద్ధరిస్తామన్నారు. -
సమ్మెలోకి విద్యుత్ ఉద్యోగులు
- తొలిరోజు మిశ్రమ స్పందన - ఉన్నతాధికారులతో చర్చలు విఫలం - సమ్మె కొనసాగిస్తామంటున్న ఉద్యోగులు విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : ఒప్పందం మేరకు వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లారు. వాస్తవానికి విద్యుత్ ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి వేతన సవరణ అమలు కావాల్సి ఉన్నప్పటికీ అది జరగకపోవటంతో రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో విద్యు త్ ఉద్యోగులు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి విధులు బహిష్కరించారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో 825 మంది రెగ్యులర్ సిబ్బందితో పాటు మరో 300 మంది కాంట్రాక్టు సిబ్బంది కూడా సమ్మెలోకి వెళ్లినట్లు విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ జి.శివకుమార్ పేర్కొన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ చెబుతున్న విధంగా పూర్తి స్థాయిలో ఉద్యోగులు తొలిరోజు సమ్మెకు సహకరించలేదని తెలుస్తోంది. గత రెండు రోజులుగా వీచిన ఈదురు గాలులతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగటంతో పలుచోట్ల మరమ్మతు పనులకు ఉద్యోగులు హాజరైనట్లు సమాచారం. తొలిరోజు ఆది వారం సెలవు దినం కావటంతో ఎవరూ సమ్మెలోకి వచ్చింది, ఎవరూ విధులు నిర్వర్తిస్తున్నది తెలియని పరిస్థితి ఉందని ఉద్యోగులే పేర్కొం టున్నారు. తొలి రోజు సమ్మెను నిలువరించేందుకు భావి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుతో పాటు గవర్నర్ నరసింహన్, సీఎస్ మహంతి, విద్యుత్ శాఖ సీఎండీలు విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులతో చర్చించినప్పటికీ ఫలితం లేకపోయింది. పీఆర్సీ అమలు పై కచ్చితమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఇవ్వలేకపోవటంతో సమ్మె కొనసాగిస్తామని విద్యుత్ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. అంతే కాకుం డా సమ్మెలో భాగంగా తొలిరోజు ఆదివారం దాసన్నపేటలో గల విద్యుత్ సహకార సంఘ భవనం ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ జిల్లా కమిటీ అధ్యక్షుడు జి. శివకుమార్ మాట్లాడుతూ వేతన సవరణను అమలు చేసేంత వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చి ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో విఫలం కావటంతో తాము సమ్మె కు దిగినట్లు పేర్కొన్నారు. అంతే తప్ప ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వినియోగదారులను ఇబ్బందులు పెట్టడం తమ ఉద్దేశం కాదని తెలి పారు. తమ సమస్యలపై ప్రభుత్వం, అధికారు లు సానుకూలంగా స్పందిస్తే తక్షణమే విధుల్లో చేరుతామని చెప్పారు. ధర్నాలో జేఏసీ ప్రతిని ధులు బి.కె.వి.ప్రసాద్, ఎం.నిర్మలమూర్తి, రాజేంద్రప్రసాద్, వర్మ పాల్గొన్నారు. నిలిచిన విద్యుత్ సరఫరా విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావంతో తొలిరోజు ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతా ల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గత రెండు రోజులుగా ఈదురు గాలులతో చాలా చోట్ల సరఫరా నిలిచిపోగా ఆదివారం నుంచి ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. అధికారులు సమాచారం మేరకు విజయనగరం పట్టణంలో మయూరి జంక్షన్, ఇందిరానగర్, ప్రదీప్ నగర్, రైల్వే న్యూకాలనీ తదితర ప్రాంతాలకు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సరఫరా నిలిచిపోయింది. ఎస్‌కోట డివిజన్లో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, నెల్లిమర్ల, పూసపాటిరేగ మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరాకు విఘాతం కలిగినట్లు తెలుస్తోంది. ఇదే తరహలో మిగిలిన ప్రాంతాల్లో కూడా సరఫరాకు అంతరాయం కలిగినట్లు సమాచారం. ఇదే విషయమై ఏపీఈపీడీసీఎల్ టెక్నికల్ డీఈటీ దైవప్రసాద్ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా ఓ వైపు సమ్మె, మరోవైపు ఈదురుగాలుల ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోవటం వాస్తవమేనన్నారు. సమస్యను పరిష్కరించేందుకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 245 మంది సిబ్బందిని తీసుకు వచ్చామని మరమ్మ తు పనులు చేపడుతున్నామని వివరించారు. -
17నుంచి విద్యుత్ ఉద్యోగుల మెరుపుసమ్మె
-
ఈ నెల 14నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
-
నేటి నుంచి నిరవధిక సమ్మెలో విద్యుత్ ఉద్యోగులు
-
రెండో రోజూ విద్యుత్ ఉద్యోగుల సమ్మె
సాక్షి, తిరుపతి: 72 గంటల సమ్మెలో భాగంగా జిల్లాలో ని విద్యుత్ ఉద్యోగులు రెండవ రోజు శుక్రవారం కూడా సమ్మెలో పాల్గొనడంతో సేవలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని 2,500 మంది ఉద్యోగులు వందశాతం సమ్మెలో పాల్గొన్నారు. వసూళ్లు, బిల్లులను రూపొందించే పని పూర్తిగా అటకెక్కింది. విద్యుత్ బ్రేక్డౌన్లను పునరుద్ధరించే పరిస్థితి లేకపోవటంతో ఉన్నతాధికారులు కూడా చేతులెత్తేయాల్సి వచ్చింది. తిరుపతి సర్కిల్లో తిరుపతి అర్బన్, రూరల్, శ్రీకాళహస్తి, రేణిగుంట, పుత్తూరు, పలమనేరు, చిత్తూరు, పుంగనూరు, మదనపల్లె, పీలేరు సబ్ డివిజన్లతో పాటు కార్యాలయాల్లో, సబ్ స్టేషన్ల లో ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. తిరుపతి డిస్కం కార్యాలయం ఎదుట జేఏసీ కన్వీనర్ డీఈ మునిశంకరయ్య, చైర్మన్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో కార్పొరేట్, ఎస్ఈ కార్యాలయ ఉద్యోగులు, నగరంలోని ఏఈలు, లైన్మన్లు, కార్యాలయాల సిబ్బంది ధర్నా చేశారు. సమైక్య వాదాన్ని వినిపిస్తూ పాటలు పాడారు. జిల్లాలో ఎస్ఈ మినహా ఏ ఒక్కరూ విధులకు హాజరుకాకపోవడంతో విద్యుత్ శాఖ పరిపాలన పూర్తిగా స్తంభించింది. మాస్క్‌లతో నిరసన డిస్కం కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ, కేసీఆర్, డిగ్గీరాజ, కోదండరాం, హరీశ్‌రావు మాస్క్‌లు ధరించి వారు ఏ రకంగా రాష్ట్ర విభజనకు కుట్ర పన్నారనేది వివరిస్తూ స్క్రిప్ట్‌తో నాటకం వేశారు. సోనియా, కేసీఆర్, డిగ్గీరాజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే నష్టపోయే రంగాల్లో ప్రధానంగా విద్యుత్ సంస్థ ఉందని పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరి సమ్మెకు ఏపీఎన్జీవోలు ఉద్యోగ సంఘం జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించారు. వారు సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసు నుంచి ర్యాలీగా ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ విద్యుత్ ఉద్యోగులు నిర్వహిస్తున్న ఆందోళనలో పాల్గొని, సంఘీభావం తెలిపారు. ఫ్యూజ్కాల్స్పై సమ్మె ప్రభావం విద్యుత్ సమ్మెతో జిల్లా వ్యాప్తంగా ఫ్యూజ్‌కాల్స్ సర్వీసులు నిలిచి పోయాయి. ఈ ఫిర్యాదులు తీసుకునేవారు లేరు. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లను మరమ్మతు చేసే నాథుడే లేడు. కాంట్రాక్టు ఉద్యోగులకు వీటి నిర్వహణ చేతగాకపోవటంతో సమ్మె ముగిసేవరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం గృహ సర్వీసులకే కాకుండా హెచ్.టీ పారిశ్రామిక సర్వీసులు, వాణిజ్య, వ్యవసాయ సర్వీసుల నిర్వహణపైనా పడుతోంది. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఉధృతం
సాక్షి, తిరుపతి: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రలో విద్యుత్ ఉద్యోగుల 72 గంటల సమ్మె జిల్లా వ్యాప్తంగా ఉద్ధృతంగా సాగుతోంది. తిరుపతిలో డిస్కం కార్యాలయం ఉద్యోగుల నినాదాలతో దద్దరిల్లింది. మదనపల్లె, చిత్తూరు, పుత్తూరు, శ్రీకాళహస్తి సబ్ డివిజన్లలో విద్యుత్ ఉద్యోగులు పూర్తి గా సమ్మెలో పాల్గొన్నారు. గురువారం ఉదయం నుంచే జిల్లాలోని వందలాది మంది విద్యుత్ ఉద్యోగులు కార్యాలయాలకు తాళాలు వేసి పెన్‌డౌన్, టూల్ డౌన్ చేసి రోడ్లపైకి వచ్చారు. సబ్ స్టేషన్లలో కేవలం కాంట్రాక్టు సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. తిరుపతి సర్కిల్లోని డీఈలు, ఏడీఈలు, అకౌంటెంట్లు, ఏఈలు, లై న్మన్లు సమ్మెలో పాల్గొంటున్నారు. సీయూజీ కార్డులను వెనక్కి ఇచ్చేశారు. అత్యవసర విద్యుత్ సేవలకు కాంట్రాక్టు ఉద్యోగులే హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 2,500 మంది ఉద్యోగులు సమ్మెకు దిగారు. కార్పొరేట్ కార్యాలయంలోని 400 మంది ఉద్యోగులు కూడా ధర్నా చేశారు. డిస్కం కార్యాలయ ప్రధాన గేటుకు తాళాలు వేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్పొరేట్ కార్యాలయం ఎదుట నిరసన కొనసాగింది. దీనికి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ అశోక్‌కుమార్, కన్వీనర్ డీఈ మునిశంకరయ్య, కో-కన్వీనర్ చలపతి, ఏడీఈలు, అకౌంట్స్, కాస్టింగ్ అధికారులు, ఎస్టాబ్లిష్మెంట్ అధికారులు పాల్గొన్నారు. సమ్మెతో ఇక్కట్లు విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేసేందుకు తంటాలు పడుతున్నారు. జిల్లాకు ఒక టోల్ నెంబరు ఇచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు బ్రేక్ డౌన్ అయిన చోట్ల సమస్య పరిష్కరించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కేవలం కాంట్రాక్టు ఉద్యోగులను ఉపయోగించి అన్ని పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కార్పొరేట్ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు ఆరు జిల్లాల్లో ఎక్కడెక్కడ విద్యుత్ సరఫరా బ్రేక్ డౌన్ అయింది, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేయాలనేది నిరంతరం సమీక్షిస్తున్నారు. డీఈలు, ఏఈలను, లైన్మెన్లను సంప్రదించాలంటే సీయూజీ ఫోన్లు లేవు. కొత్తవారికి ధైర్యంగా పనులు అప్పగించలేకునాన్నారు. అత్యవసర సేవలకు మినహాయింపు జిల్లాలో రెగ్యులర్ విద్యుత్ ఉద్యోగులు టూల్‌డౌన్ చేసినా అత్యవసర సేవలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని జేఏసీ కన్వీనర్ మునిశంకరయ్య తెలిపారు. సమస్యలను కాంట్రాక్ట్ ఉద్యోగుల ద్వారా పరిష్కరిస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రకటించిన మేర కు 72 గంటల సమ్మె జరుగుతుందని, సమైక్య ప్రకటన రానిపక్షంలో దాన్ని నిరవధిక సమ్మెగా మార్చేం దుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. -
విద్యుత్ ఉద్యోగుల 72 గంటల సమ్మె
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్:సమైక్యాంధ్రకు మద్దతుగా నేటి నుంచి జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులందరూ సమ్మె బాట పట్టనున్నారు. ఇప్పటికే దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విద్యుత్ ఉద్యోగులు, సమైక్య రాష్ట్రంపై కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో 72 గంటల పాటు సమ్మె చేయాలని నిర్ణయించారు. తమ సిమ్‌కార్డులు సైతం అధికారులకు అందించారు. ఈ మేరకు బుధవారం స్థానిక కర్నూలు రోడ్డులోని సబ్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యుత్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులంతా సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ ఎం హరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల నుంచి పలు ఆందోళనలు నిర్వహించామని, అలాగే సమ్మెలోకి వెళ్తామని పలుమార్లు సమ్మె నోటీసులు ఇచ్చామని తెలిపారు. అయినా ప్రభుత్వం స్పందించని కారణంగానే నేటి నుంచి 72 గంటల సమ్మెలోకి వెళ్తున్నట్లు చెప్పారు. జేఎల్ఎం స్థాయి ఉద్యోగి నుంచి చీఫ్ ఇంజినీర్ స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ సమ్మెలోకి వస్తారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 1500 మంది డిపార్టుమెంట్ ఉద్యోగులు, 1200 కాంట్రాక్టు ఉద్యోగులు కలిపి మొత్తం 2700 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. ఉద్యోగుల సమ్మె వల్ల విద్యుత్ సరఫరాకు కలిగే అంతరాయాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు, వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాలన్నదే తమ ఏకైక నినాదం అని వివరించారు. గత 60 ఏళ్లలో విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేసిన సందర్భాలు లేవని, ప్రస్తుత సమ్మెకు పూర్తిగా ప్రభుత్వాలదే బాధ్యత అన్నారు. నెల రోజులుగా జీతాలు లేకుండా సమ్మె చేస్తున్న ఉద్యోగుల ఆందోళనకు అండగా ఉంటామని చెప్పారు. అలాగే నేటి నుంచి స్థానిక ఎస్ఈ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్ ఎన్ జయాకరరావు, కన్వీనర్ టి సాంబశివరావు, స్టాలిన్‌కుమార్, శివప్రసాద్, నరశింహారావు, ఉదయ్‌కుమార్, బీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారుల కోసం రౌండ్ ది క్లాక్ సేవలు సాక్షి, తిరుపతి : సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో డిస్కం పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామని చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ హెచ్‌వై.దొర బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఆయా జిల్లాల పరిధిలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే లోడ్ మోనటరింగ్ సెల్ (ఎల్ఎంసి)కు ఫోన్ చేస్తే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రకాశం జిల్లా పరిధిలోని విద్యుత్ వినియోగదారులు 9440817491 నంబర్‌కు ఫోన్ చేయవ చ్చని వెల్లడించారు. కార్పొరేట్ ఆఫీసులో ఉన్న 9440814319కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్
సాక్షి, తిరుపతి: విద్యుత్ ఉద్యోగులు సమైక్య ఉద్యమాన్ని ఉద్ధృత చేస్తున్నారు. గురువారం నుంచి సమ్మెలోకి వెళ్తుండడంతో బుధవారం త మ సిమ్‌కార్డులను ఎస్పీడీసీఎల్ కంపెనీకి వెనక్కి పంపారు. డిస్కం పరిధిలోని నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉద్యోగులు సిమ్‌కార్డులను ఎస్ఈలకు అందజేశారు. జిల్లాలో 500కు పైగా సిమ్‌కార్డులను ఉద్యోగులు వెనక్కి ఇచ్చారు. తిరుపతిలోని డిస్కం కార్పొరేట్ కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగులు కూడా 150 మందికి పైగా సిమ్‌కార్డులు వెనక్కి ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోనూ 250 మంది విద్యుత్ అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది సిమ్‌కార్డులను వెనక్కి ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో 300కు పైగా సిమ్‌కార్డులు ఎస్ఈకి అందజేశారు. నేటి నుంచి సమ్మె: డిస్కం పరిధిలోని ఆరు జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగులు గురువారం నుంచి సమ్మె సైరన్ మోగించనున్నారు. ప్రధానంగా తిరుపతి, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు నగరాల్లో సమ్మె ప్రభావం కనపడనుంది. ఎల్టీ సర్వీసులతో పాటు పారిశ్రామికంగా ఎక్కువ హెచ్‌టీ సర్వీసులు ఉన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ సమ్మెతో పరిశ్రమలకు పెద్ద దెబ్బ తగలనుంది. సమ్మెలో భాగంగా మొదట సర్వీసు మెయింటెన్స్ వంటి పనులకు సంబంధించి విధులకు గైర్హాజరు కానున్నారు. ఆ తర్వాత విడతల వారీగా విద్యుత్ సరఫరా కూడా నిలిపేసేందుకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వాణిజ్య సర్వీసులు ఎక్కువగా ఉన్నాయి. వీటికి కూడా విద్యుత్ సరఫరా నిలి పేసే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో డిస్కం సీఎండీ హెచ్‌వై దొర అత్యవసర సర్వీసులైన ఆస్పత్రులు, హోటళ్లు, తిరుమల టీటీడీ అవసరాలకు విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలని ఇప్పటికే విద్యు త్ ఉద్యోగుల జేఏసీ నాయకులకు విజ్ఞప్తి చేసి ఉన్నారు. నేడు సీఎంతో చర్చలు: ట్రాన్స్‌కో, డిస్కం విద్యుత్ ఉద్యోగ సంఘాలతో సీఎం బుధవారం సాయంత్రం 4 గంటలకు జరపాల్సిన చర్చలు వాయిదాపడ్డాయి. గురువారం ఉదయం 10 గంటలకు జరగనున్నాయి. సీఎంతో చర్చల్లో పాల్గొనేందుకు తిరుపతి నుంచి జేఏసీ కన్వీనర్ మునిశంకరయ్య, ఇతర నాయకులు హైదరాబాద్ వెళ్లారు. -
విద్యుత్‌శాఖ సిబ్బంది వెరైటీ నిరసనలు