కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
Published Wed, Aug 10 2016 1:19 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
– పుష్కరాల నిర్వహణపై ఇక్కడినుంచే పర్యవేక్షణ
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : కృష్ణా పుష్కరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కలెక్టరేట్‌లో పుష్కరాల కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కలెక్టరేట్‌లో కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దుచేసి జిల్లా అధికారులంతా పుష్కరాల ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 25స్థానిక, 27ముఖ్యమైన పుష్కర ఘాట్‌ల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. ఆయాఘాట్లలో నియమించిన అధికారులకు అసరమైన సూచనలు చేసి, యాత్రికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోనున్నారు. బుధవారం డీఆర్వో భాస్కర్ పర్యవేక్షణలో వీసీ హాల్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. హాల్‌లో పెద్ద స్క్రీన్‌ను ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షించనున్నారు. దీంతోపాటు జిల్లాలోని ఘాట్ల వద్ద ఇబ్బందులు, ఇతర అత్యవసర సమస్యలను ప్రజలు కంట్రోల్ రూమ్‌కు తెలియజేసేందుకు ఫోన్ నంబర్ 08542–242210, సెల్ నంబర్: 9866098111 కేటాయించారు.
పుష్కర వలంటీర్లు, ఎన్‌జీఓలకు ప్రత్యేక టీషర్టులు, టోపీలు
పుష్కరాల నిర్వహణలో పాల్గొనే వలంటీర్లు, ఎన్‌జీఓలను సులభంగా గుర్తించేందుకు ప్రత్యేక టీషర్టులు, టోపీలు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం 10వేల టీషర్టులు, 6వేల టోపీలు జిల్లా కేంద్రానికి చేరాయి.
Advertisement
Advertisement