పశ్చిమ డెల్టాకి నీటి విడుదల కుదింపు
పశ్చిమ డెల్టాకి నీటి విడుదల కుదింపు
Published Sun, Jul 24 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
కొవ్వూరు :జిల్లాలో గోదావరి డెల్టా ఆయకట్టు పరిధిలో ఉన్న పశ్చిమ డెల్టా కాలువకి ఆదివారం నీటి విడుదల వెయ్యి క్యూసెక్కులు తగ్గించారు. శనివారం 6,500 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టిన అధికారులు ఆదివారం సాయంత్రం నుంచి 5,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఏలూరు కాలువకి 1,133 క్యూసెక్కులు, ఉండి కాలువకి 1,826, నరసాపురం(కాకరపర్రు) 1,983, జీఅండ్‌వీ(గోస్తనీ) 636, అత్తిలి(గొడిచర్ల)కాలువకి 677 క్యూసెక్కుల చొప్పున నీటిని విడిచి పెడుతున్నట్టు నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
సముద్రంలో 1.72 లక్షల క్యూసెక్కులు
గోదావరి నుంచి 1,72,420 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు 10.70 అడుగులుగా నమోదైంది. ధవళేశ్వరం, మద్దురూ ఆర్మ్‌లలో గేట్లను 0.40, విజ్జేశ్వరం, ర్యాలీ ఆర్మ్ గేట్లను 0.30 మీటర్లు ఎత్తులేపి వరదనీటిని దిగువకి విడుదల చేస్తున్నారు.
Advertisement