వివరాలు కంప్యూటర్‌లో నమోదు చేయాలి
జిల్లా పరిషత్‌లోని అన్ని సెక్షన్లకు సంబంధించిన రికార్డులు, వివరాలను కంప్యూటరీకరించాలని జెడ్పీ సీఈవో మోహన్‌లాల్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్‌లో జెడ్పీ సిబ్బందితో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాపరిషత్ : జిల్లా పరిషత్‌లోని అన్ని సెక్షన్లకు సంబంధించిన రికార్డులు, వివరాలను కంప్యూటరీకరించాలని జెడ్పీ సీఈవో మోహన్‌లాల్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్‌లో జెడ్పీ సిబ్బందితో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో ఆడిట్ అభ్యంతరాలను అడిగితెలుసుకున్నారు. ఆడిట్‌లో జరిగిన తప్పిదాలను సవరించుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఆడిట్ రికార్డులను త్వరగా పూర్తిచేసి సకాలంలో అందజేయాలన్నారు. ఆడిట్ పేరాలు ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నాయని వివరాలు అడిగితెలుసుకున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను వెంటనే సమర్పించి క్లియర్ చేయాలని తెలిపారు. అలాగే అన్ని సెక్షన్లకు సంబంధించిన రికార్డులు, వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేయాలని తెలిపారు. సమీక్షలో అసిస్టెంట్ ఆడిట్ అధికారి విజయలక్ష్మి, సూపరింటెండెంట్లు లక్ష్మీనారాయణ, భారతి, శ్రీనివాస్, రామ్మోహన్, జిల్లా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.