డైట్‌ అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం | Diet invited applications for the posts of faculty | Sakshi
Sakshi News home page

డైట్‌ అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Published Thu, Aug 18 2016 12:35 AM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM

Diet invited applications for the posts of faculty

న్యూశాయంపేట : హన్మకొండలోని ప్రభుత్వ డైట్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ అయ్యంగార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు ఎన్‌సీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత సబ్జెక్టులో (పీజీ, ఎంఈడీ) కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. సంబంధిత హెచ్‌ఎంలు, ఎంఈఓల ఆమోదంతో రేషనలైజేషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక సబ్జెక్టుకు ఒకరి కన్నా ఎక్కువ ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 26లోగా ప్రిన్సిపాల్‌ ప్రభుత్వ డైట్‌ కళాశాలకు దరఖాస్తులు అందజేయాలన్నారు. తెలుగు మీడియంలో తెలుగు, సైన్స్‌, సోషల్‌ మెథడ్స్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ, లైబ్రేరియన్, ల్యాబ్‌ టెక్నిషియన్, ఆర్ట్‌ ఎడ్యుకేషన్‌ పోస్టులతో పాటు ఉర్దూ మీడియంలో ఉర్దూ, ఇంగ్లిష్, గణితం, సైన్స్‌, సోషల్‌మెథడ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇతర వివరాలకు, దరఖాస్తు ఫారాల కోసం డైట్‌ కళాశాలలోని సురేష్‌కుమార్‌ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement