ఉద్యోగులపై దాడులు తగవు | dont attack on employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగులపై దాడులు తగవు

Published Sun, Jul 31 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

మాట్లాడుతున్న కారం రవీందర్‌రెడ్డి

మాట్లాడుతున్న కారం రవీందర్‌రెడ్డి

– పీఆర్‌సీ బకాయిలను వెంటనే చెల్లించాలి
– కేంద్రం ఉద్యోగ వ్యతిరేక విధానాలపై పోరాటం
– సీపీఎస్‌ విధానంపై జాతీయ స్థాయిలో సమ్మె 
– టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి
 
ఖమ్మం జెడ్పీసెంటర్‌: రాష్ట్రంలో ఉద్యోగులపై జరుగుతున్న దాడులతో వారు ఆత్మసై్థర్యం కోల్పోతున్నారని, దాడులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఖమ్మం టీటీసీ భవన్‌లో తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని, హరితహారంలో మొక్కలు నాటారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..ప్రభుత్వం ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, 9నెలల పీఆర్‌సీ బకాయిలను జీపీఎఫ్‌ ఖాతాలో జమ చేయాలని కోరారు. నగదు రహితవైద్యాన్ని అందిస్తామని హామీనిచ్చి రెండేళ్లు గడుస్తున్నా..ఇప్పటికీ హెల్త్‌కార్డుల అమలుకు ఆటంకాలు తప్పట్లేదని, కొంత ప్రీమియం చెల్లించేందుకు సిద్ధమేనని, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. ఉద్యోగ, వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్‌ 2న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఆంధ్రాలో పనిచేస్తున్న 1,216 మంది తెలంగాణ ఉద్యోగులను ఇక్కడికి రప్పించాలని డిమాండ్‌ చేశారు. టీఎన్‌జీఓ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దేవీ ప్రసాద్‌ మాట్లాడుతూ..నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి, పాత విధానాన్ని కొనసాగించడంలో ప్రభుత్వం నిర్లిప్తతగా వ్యవహరిస్తోందన్నారు. 17, 18 తేదీల్లో జాతీయ అఖిలభారత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ముత్తు సుందరం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. హరితహారం కార్యక్రమంలో ఉద్యోగికి 15మొక్కల చొప్పున నాటాలని తీర్మానించినట్లు వివరించారు. సమావేశంలో టీఎన్‌జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమీర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేందర్, కోశాధికారి వేణోగోపాల్, మహిళా అధ్యక్షురాలు రేచల్, జిల్లాల అధ్యక్షులు రంగరాజు, అశోక్, శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్వర్, వెంకటేశ్వరమూర్తి, లక్ష్మణ్, రాజేష్‌కుమార్, ప్రతాప్, కిషన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement