స్నేహానికి చిరునామాగా, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు జనగామకు చెందిన ఈ ఫొటోలోని ముగ్గురు వ్యక్తులు. చిన్నప్పటి నుంచి స్నేహితులైన వారు... వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. కానీ స్నేహం వారిని ఎంతోకాలం విడిగా ఉంచలేకపోయింది.
స్నేహానికి చిరునామాగా, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు జనగామకు చెందిన ఈ ఫొటోలోని ముగ్గురు వ్యక్తులు. చిన్నప్పటి నుంచి స్నేహితులైన వారు... వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. కానీ స్నేహం వారిని ఎంతోకాలం విడిగా ఉంచలేకపోయింది. ముగ్గురూ ఒక్కటై అంచలంచెలుగా ఎదుగుతున్నారు. జనగామ పట్టణంలో ఒకప్పుడు జనతా ఫెర్టిలైజర్స్ పేరుతో ఎండీ ఇద్రిస్, కిషోర్ ఆగ్రో సర్వీసెస్ పేరుతో పజ్జూరి గోపయ్య, సంతోష్ ఫెర్టిలైజర్స్ పేరుతో గొరిగె అయిలయ్య వేర్వేరుగా వ్యాపారాలు నిర్వహించేవారు.
స్నేహితులం.. ముగ్గురు కలిసి వ్యాపారం చేస్తే బాగుంటుంది...లాభనష్టాలను సరిసమానంగా పంచుకుందామని తలచారు. అనుకున్నదే తడవుగా 2006లో తమ వ్యాపార సంస్థల పేర్లలో మొదటి అక్షరాలను చేర్చి జేకేఎస్ అగ్రిమాల్, జేకేఎస్ జిన్నింగ్ మిల్‌ను మల్టీనేషనల్ కంపెనీలకు దీటుగా స్థాపించారు. పెద్ద కంపెనీలతో పోటీపడుతూ ముందుకు సాగుతున్నారు. ‘స్నేహం విలువ మాకు తెలుసు. అదే మమ్మల్ని ఒక్కటిగా చేసింది. వ్యాపారంలో పొత్తులు కుదరవని.. విడిపోవడం ఖాయమని చాలా మంది భావించారు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మా మధ్య మనస్పర్థలు చోటుచేసుకోలేదు. అందరం ఒకే మాట.. ఒకే బాటగా సాగుతున్నాం.’ అంటూ సమాజంలో స్నేహానికి ఉన్న విలువను చాటిచెబుతున్నారు అయిలయ్య, గోపయ్య, ఎండీ.ఇద్రిస్.